కొవిన్ యాప్ డేటా లీక్.. క్లారిటీ ఇచ్చిన కేంద్ర ఆరోగ్య శాఖ‌

-

వ్యాక్సిన్ రిజిస్ట్రేష‌న్ కోసం వినియోగించే కొవిన్ పోర్ట‌ల్ లీక్ అయిందంటూ గ‌త కొద్ది రోజుల నుంచి వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ వార్త‌లు దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం అయ్యాయి. దీంతో ఈ డేటా లీక్ వార్తల పై తాజా గా కేంద్ర ఆరోగ్య శాఖ స్పందించింది. కొవిన్ పోర్ట‌ల్ నుంచి ఎలాంటి డేటా కూడా లీక్ కాలేద‌ని స్ప‌ష్టం చేసింది. ఇప్పుడు వ‌స్తున్న వార్త‌ల‌లో నిజం లేద‌ని తెల్చి చెప్పింది. కొవిన్ యాప్ లో అంద‌రికీ వ్య‌క్తిగ‌త స‌మాచారం భ‌ద్రంగానే ఉంద‌ని వివ‌రించింది. కాగ కొవిడ్ వ్యాక్సినేష‌న్ స‌మ‌యంలో ప్ర‌జ‌ల నుంచి చిరునామా, ఆర్టీపీసీఆర్ టెస్టు ఫ‌లితాలు వంటి వివ‌రాల‌ను సేక‌రించ‌లేద‌ని తెలిపింది.

కాగ ఇటీవ‌ల రైడ్ ఫోర‌మ్స్ అనే వెబ్ సైటులో కొవిన్ యాప్ లో రిజిస్ట‌ర్ అయిన దాదాపు 20 వేల మందికి పైగా వ్య‌క్తిగ‌త స‌మాచారాన్ని వేలం వేస్తున్న‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. ఈ యాప్ ద్వారా వ్య‌క్తిగ‌త చిరునామాలు, మొబైల్ నంబ‌ర్ తోపాటు క‌రోనా రిజల్ట్ వంటివి అమ్మకానికి పెట్టార‌నే వార్త‌లు దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నాలు సృష్టించాయి. అయితే తాజా గా కేంద్ర ఆరోగ్య శాఖ ఈ డేటా లీక్ పై క్లారిటీ ఇవ్వ‌డంతో అంద‌రూ ఊపిరి పీల్చుకున్నారు. కాగ కొవిన్ యాప్ విష‌యంలో కేంద్ర ఆరోగ్య శాఖ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు కొవిన్ యాప్ లో వ్యాక్సిన్ కోసం ఇక మొబైల్ నంబ‌ర్ నుంచి న‌లుగురు మాత్రమే రిజిస్టర్ కావ‌చ్చు. కానీ తాజా గా కేంద్ర ఆరోగ్య శాఖ తీసుక‌న్న ఈ నిర్ణయంతో ఒకే మొబైల్ నంబ‌ర్ నుంచి ఆరుగురు కూడా రిజిస్ట‌ర్ కావ‌చ్చు.

Read more RELATED
Recommended to you

Latest news