ఏపీ కేబినెట్ సమావేశంపై పయ్యావుల కేశవ్ కీలక వ్యాఖ్యలు

-

మంగళవారం సచివాలయంలోని మొదటి బ్లాక్ లో ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ మంత్రివర్గ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. అయితే ఏపీకేబినెట్ సమావేశంపై టిడిపి సీనియర్ నేత, పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

కేబినెట్లో తీసుకున్న నిర్ణయాలు ప్రజల కోసం కాకుండా.. అయినవారి కోసమే నిర్ణయాలు ఉంటాయని ఆయన ఎద్దేవా చేశారు. సీఎం జగన్ నిర్ణయాలతో విద్యుత్ రంగానికి తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు పయ్యావుల. జగన్ తప్పుడు నిర్ణయాల వల్లే ప్రజలు అధిక బిల్లులు చెల్లించాల్సి వచ్చిందన్నారు. విద్యుత్ రంగంపై గతంలో తాను చేసిన ఆరోపణలకు ఏమాత్రం సమాధానం చెప్పలేదని.. ఇప్పుడైనా చెప్పాలని పయ్యావుల డిమాండ్ చేశారు. కేంద్రం ఆదేశాలకు, సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధంగా పంప్డ్ స్టోరేజ్ ఒప్పందాలు, కేటాయింపులు ఉన్నాయన్నారు. నిబంధనలకు విరుద్ధంగా హైడ్రో పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులను బ్యాక్ గ్రౌండ్ ఉన్న కంపెనీలకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Latest news