తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం..ఇక ఇంటింటికీ వ్యాక్సిన్

-

తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.ఇక ఇంటింటికీ వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. పి.హెచ్.సీ ల పై నెలవారీ సమీక్షలో భాగంగా.. డీఎంహెచ్వో, డిప్యూటీ డిఎంహెచ్వోలు నెలలో ప్రతి పి.హెచ్.సీ సందర్శించాలని ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు ఆదేశాలు జారీ చేశారు.

నెలలో ఒక రోజు పి.హెచ్.సీ లలో నిద్ర చేయాలి. నేను కూడా నిద్ర చేస్తాను..ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు• హెచ్.వో.డీ లు నెలవారీ సమీక్షలు చేసుకోవాలని.. సిజెరియన్ల రేటు గణనీయంగా తగ్గించాలని ఆదేశాలు జారీ చేశారు.

తీరు మారని ప్రైవేటు ఆసుపత్రులపై మెడికల్ కౌన్సిల్ కు ఫిర్యాదు చేయాలి…వచ్చే నెల నాటికి పనితీరు మరింత మెరుగు పడాలని వెల్లడించారు. లేకుంటే చర్యలు తప్పవు…పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిలో భాగంగా ఇంటింటా కరోనా వాక్సిన్ ఇవ్వాలని తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారి ఆలోచనకు అనుగుణంగా ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news