ప్రగతిభవన్ లో నేడు కీలక భేటీ జరగనుంది. తెలంగాణ సీఎం కేసీఆర్ మంత్రులతో సమావేశం కానున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలు, ఐటీ, ఈడి దాడుల వంటి పరిణామాలపై మంత్రులతో చర్చించనున్నారు. ఐటీ దాడుల నేపథ్యంలో ఎవరు భయపడ వద్దని సీఎం కేసీఆర్ మంత్రులు, ఎమ్మెల్యేలకు సూచించారు.
కేంద్ర ప్రభుత్వ సంస్థలైన ఐటి, ఈడి, సిబిఐ వంటి సంస్థలు ఎప్పుడు ఎవరి మీద పడతాయో అనే భయంలో పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు ఆడలిపోతున్నారు. ఇటీవల రాష్ట్ర పౌరసరఫరాల శాఖ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ఇళ్లపై ఈడి మరియు ఐటీ దాడులు జరిగిన విషయం తెలిసిందే. తాజాగా నేడు మంత్రి మల్లారెడ్డి, ఆయన సన్నిహితులు, కొడుకు, అల్లుడు ఇళ్లపై ఐటి దాడులు జరుగుతున్న నేపథ్యంలో నేడు సాయంత్రం సీఎం కేసీఆర్ నిర్వహించే భేటీకి ప్రాముఖ్యత సంతరించుకుంది.