తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 30న జరుగనున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే అధికార బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో ప్రకటించింది. మరోవైపు బీజేపీ ఈనెల 17న ప్రకటించనున్నట్టు సమాచారం. ఇక కాంగ్రెస్ పార్టీ కూడా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మేనిఫెస్టో రేపు ప్రకటించనుంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో పై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. మేనిఫెస్టోలో కీలక అంశాలను పరిగణలోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ ప్రజలను ఆకర్షించేందుకు కాంగ్రెస్ తమ మేనిఫెస్టో సిద్ధం చేసింది. ఈ మేనిఫెస్టో ను మల్లికార్జున ఖర్గే శుక్రవారం మధ్యాహ్నం 12.30 గంటలకు విడుదల చేయనున్నారు.
కాంగ్రెస్ మేనిఫెస్టో కీలక అంశాలు :
ధరణి స్థానంలో భూ భారతి అప్ గ్రేడ్ యాప్.
గ్రామ వార్డు సభ్యులకు గౌరవ వేతనం
రేషన్ డీలర్లకు గౌరవ వేతనంతో పాటు కమీషన్
అభయహస్తం పథకం తిరిగి పునరుద్ధరణ
ఆర్ఎంపీ, పీఎఎంపీలకు గుర్తింపు కార్డులు
అమ్మ హస్తం పేరుతో 9 నిత్యావసర వస్తువులు పంపిణీ.
ఎంబీసీలకు ప్రత్యేక కార్పొరేషన్
పెళ్లి కూతురు కానుకగా రూ.1లక్షతో పాటు తులం బంగారం
రేషన్ కార్డు దారులకు సన్నబియ్యం.