గణేష్ నిమజ్జనoపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన.

-

గణేష్ నిమజ్జనం పై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కీలక ప్రకటన చేశారు. ఈ నెల 19 వ తేదీన నిర్వహించే గణేష్ శోభాయాత్రకు అన్ని ఏర్పాట్లు చేశామని.. నిమజ్జన ఏర్పాట్లకు ఉన్న అడ్డంకులు అన్ని తొలగిపోయాయని పేర్కొన్నారు. శోభాయాత్ర, విగ్రహాల నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా పోలీసు, ట్రాపిక్ పోలీసు, GHMC, వాటర్ వర్క్స్, R&B, ఎలెక్ట్రికల్ తదితర అన్ని ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేసినట్లు ఆయన వెల్లడించారు.

శోభాయాత్ర, నిమజ్జనం పర్యవేక్షణ కోసం వివిధ శాఖల అధికారులతో ఒక కంట్రోల్ రూమ్ ను కూడా ఏర్పాటు చేశామని.. విగ్రహాల నిమజ్జనం జరిగే ప్రధాన నీటివనరు హుస్సేన్ సాగర్ పరిసరాలలో 24 క్రేన్ ల్ ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. GHMC పరిధిలోని నిమజ్జనం కోసం గుర్తించిన రిజర్వాయర్ లు, 25 చెరువులు, 25 బేబీ పాండ్స్ వద్ద మొత్తం 300 క్రేన్ లను ఏర్పాటు చేశామని.. 100 మంది గజ ఈతగాళ్ళను సిద్దంగా ఉన్నట్లు పేర్కొన్నారు. నిమజ్జనం కోసం విగ్రహాలను తీసుకెళ్లేందుకు మండపాల నిర్వహకులకు అవసరమైన వివిధ రకాల వాహనాలు వెయ్యి వరకు GHMC పరిధిలోని 10 పాయింట్స్ లలో అందుబాటులో ఉన్నారని.. వీటి పర్యవేక్షణ కోసం 30 మంది RTA అధికారులు, ఇన్స్పెక్టర్ లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

గణేష్ విగ్రహాల నిమజ్జనం జరిగే ప్రాంతాలలో, శోభాయాత్ర నిర్వహించే రహదారులలో ఎప్పటికప్పుడు పారిశుధ్య నిర్వహణ జరిగేలా 8,160 మంది సిబ్బందితో శానిటరీ సూపర్ వైజర్ లేదా SFA ల ఆధ్వర్యంలో 215 ప్రత్యేక బృందాలు ఉన్నట్లు స్పష్టం చేశారు. శోభాయాత్ర, నిమజ్జనం ప్రశాంతంగా నిర్వహించేందుకు 27,955 మంది వివిధ స్థాయిలలోని పోలీసు సిబ్బందితో పాటు గ్రే హ్యాండ్స్, ఆక్టోపస్ దళాల బందోబస్తు చేసినట్లు పేర్కొన్నారు. ఈ సంవత్సరం కూడా నాంపల్లి, లక్డీకాపూల్, ఖైరతాబాద్, సంజీవయ్య పార్క్, జేమ్స్ స్ట్రీట్, బేగంపేట రైల్వే స్టేషన్ ల నుండి ప్రత్యేకంగా MMTS రైళ్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news