KGF2: రాఖీ భాయ్ రికార్డుల ఊచకోత..ఏడు రోజుల్లో రూ.720 కోట్లు

-

రాకింగ్ స్టార్ యశ్ అలియాస్ రాఖీ భాయ్ ఇండియన్ బాక్సాఫీసు రికార్డులను తిరగరాస్తున్నాడు. ఈ నెల 14న విడుదలైన KGF2 పిక్చర్ తో దేశవ్యాప్తంగా రాఖీ భాయ్ ఫుల్ ఫేమస్ అయిపోయారు. ఈ సినిమాకు విశేషమైన ఆదరణ లభిస్తోంది. కేజీఎఫ్ చాప్టర్ 1ను మించిన ఆదరణ ఈ చిత్రానికి లభిస్తోంది.

ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలై చాప్టర్ 1 ఎంత ఘన విజయం సాధించిందో అంతకు మించిన విజయాన్ని KGF2 డెఫినెట్ గా సాధిస్తుంది. బాలీవుడ్ రికార్డులన్నిటినీ దాటుకుంటూ ముందుకెళ్లిన ఈ చిత్రం విడుదలై వారం రోజులు కాగా, ఈ ఏడు రోజుల్లోనే రూ.720 కోట్లు కలెక్ట్ చేయడం విశేషం.

ప్రశాంత్ నీల్ – యశ్ కాంబోలో వచ్చిన ఈ చిత్రం ఇంతటి ఘన విజయం సాధించడానికి ప్రధాన కారణం టీమ్ అని చెప్పొచ్చు. ఈ పిక్చర్ కోసం మూవీ యూనిట్ సభ్యులు ఏళ్ల తరబడి కసిగా పని చేశారు. ప్రస్తుతం మూవీ యూనిట్ సభ్యులు, టెక్నీషియన్స్, నటీనటులు అందరూ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు. ఈ చిత్రం తర్వాత ప్రశాంత్ నీల్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో ‘సలార్’ పిక్చర్ చేయనున్నారు.


ఇప్పటికే ఈ మూవీ 30 శాతం షూటింగ్ కంప్లీట్ చేసిన ప్రశాంత్..త్వరలో మళ్లీ షూటింగ్ లో జాయిన్ కానున్నారు. ప్రభాస్ చిత్రం తర్వాత తారక్ తో చేయనున్నారు. కాగా, యశ్ నెక్స్ట్ ఫిల్మ్ అప్ డేట్ కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అయితే, యశ్ తన తర్వాత చిత్రం గురించి ఇంకా ఆలోచించడం లేదు. KGF2 సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు.

 

Read more RELATED
Recommended to you

Latest news