ఫ్యాక్ట్ చెక్: కచ్చా బాదం పాట పాడిన భువన్ కి రైల్వేస్ లో ఉద్యోగం వచ్చిందా..?

-

తరచూ మనకి సోషల్ మీడియా లో ఏదో ఒక ఫేక్ వార్త కనపడుతూనే ఉంటుంది. నిజానికి ఇలాంటివి నమ్మొద్దు అని సోషల్ మీడియాలో తెగ ప్రచారం చేస్తూ ఉంటారు. ఫేక్ వార్తలు వల్ల మనమే నష్ట పోవాల్సి ఉంటుంది. ప్రభుత్వ స్కీములు మొదలు ఉద్యోగాల వరకూ చాలా ఫేక్ వార్తలను మనం చూస్తూనే ఉంటాం. అందుకని తెలియని వాటికీ, అనుమానంగా అనిపించే వాటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. లేదంటే తీవ్రంగా నష్ట పోవాల్సింది మనమే.

 

ఇక ఇది ఇలా ఉంటే తాజాగా ఒక పోస్టు వైరల్ గా మారింది. కచ్చా బాదాం పాటతో ఫేమస్ అయిన భువన్ గురించి మనకు తెలిసిందే. ఆ పాట తో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయారు భువన్. బెంగాల్ లో పల్లీలమ్ముకునే భువన్ కచ్చా బాదం పాటతో తెగ ఫేమస్ అయిపోయారు. అయితే అతనికి రైల్వే లో ఉద్యోగం వచ్చిందని రైల్వే మేనేజర్ గా పోస్ట్ ఇచ్చారని సోషల్ మీడియాలో వార్త వస్తోంది. అయితే మరి ఇందులో నిజం ఎంత అనేది చూస్తే వీడియో లో ఒక వ్యక్తి తెల్లరంగు యూనిఫామ్ ధరించి వాకి టాకీ ద్వారా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు.

https://www.instagram.com/reel/CXmDJI4lMwe/?utm_source=ig_web_button_share_sheet

ఈ వీడియో మొత్తం కూడా కచ్చ బాదం పాట ప్లే చేయడం జరిగింది. దీంతో ఒక ఫేస్బుక్ యూజర్ కచ్చా బాదం పాట పాడిన వ్యక్తి కి రైల్వే మేనేజర్ గా ఉద్యోగం వచ్చిందని పోస్ట్ చేశారు. ఈ వీడియోకి ఆరు మిలియన్ల వ్యూస్ వచ్చాయి.

దీనిపై ఇండియా టుడే యాంటీ ఫేక్ న్యూస్ వార్ రూమ్ స్పందించింది. ఇందులో ఏ మాత్రం నిజం లేదని చెప్పేసింది. ఇండియన్ రైల్వేస్ భువన్ ని ఉద్యోగానికి తీసుకోలేదని తెలుస్తోంది. ఇది కేవలం ఫేక్ వార్త మాత్రమే వీడియో లో ఉన్న వ్యక్తి భువన్ కాదు కేకే ముర్ము. అతను రైల్వే గార్డ్ అని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news