బ్రేకింగ్ : మరికొద్దిసేపట్లో ఖైరతాబాద్ బడా గణేషుడి షోభాయాత్ర ప్రారంభం కానుంది. ఈ సారి పంచముఖ మహాలక్ష్మీ గణపతి గా కొలువుదీరిన ఖైరతాబాద్ గణనాథుడు.. ఇవాళ నిమజ్జనం కానున్నాడు. 50 అడుగుల ఎత్తులో మట్టి తో బడా గణేష్ తయారీ అయింది. మట్టితో విగ్రహ తయారు చేయడంతో 60 నుండి 70 టన్నులకు విగ్రహ బరువు చేరింది.
విగ్రహ నిమర్జన తరలింపుకు 70 అడుగుల పొడువు, 11 అడుగుల వెడల్పు ఉన్న 26 టైర్ల టస్కర్ వాహనం ఏర్పాటు చేశారు అధికారులు. 100 టన్నుల బరువు మోయనున్న వాహనం.. ఖైరతాబాద్ విగ్రహాన్ని అవలీలగా తీసుకుపోనుంది. ఎన్టీఆర్ మార్గ్ క్రేన్ నం 4 వద్ద ఖైరతాబాద్ గణనాథుడి నిమర్జనం జరగనుంది. మద్యాహ్నం 2 గంటల లోపు నిమర్జనం పూర్తయ్యేలా ఏర్పాటు చేశారు అధికారులు. ఇక గణేష్ నిమజ్జనం నేపథ్యంలో హైదరాబాద్ వ్యాప్తంగా ట్రాఫిక్ ఆంక్షలతో పాటు.. మద్యం దుకాణాలు కూడా బంద్ కానున్నాయి.