మరోసారి రెచ్చిపోయిన ఖలీస్తాన్ మద్దతుదారులు..వీడియో వైరల్..

-

దేశ వ్యాప్తంగా ఎక్కడ విన్నా ఖలిస్తాన్‌ సానుభూతిపరుడు అమృత్‌పాల్‌ సింగ్‌ పేరే వినిపిస్తోంది. సినిమా రేంజ్‌లో​ ట్విస్ట్‌ ఇస్తూ వేషాలు మారుస్తూ ఐదు రోజులుగా పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్నాడు.అతని కోసం సినిమా స్టైల్ లో అధికారులు ఛేజ్ లు చేసిన విషయం తెలిసిందే..కార్లు, బైకులు మారుతూ పోలీసులను ముప్పుతిప్పలు పెడుతున్నాడు. ఇక, అమృత్‌పాల్‌ దేశం విడిచి పాకిస్తాన్‌, నేపాల్‌లోకి వెళ్లినట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

బుధవారం అమృత్‌పాల్‌ పరారీ నేపథ్యంలో ఆయన భార్య కిరణ్‌దీప్‌ కౌర్‌పై పోలీసులు నిఘా పెంచారు. కిరణ్‌దీప్‌ సహా ఆమె కుటుంబ సభ్యులను పోలీసులు బుధవారం విచారించారు. మహిళా పోలీసు అధికారితో సహా పోలీసు బృందం దాదాపు గంటపాటు కిరణ్‌దీప్ కౌర్ ఆమె తండ్రి తార్సేమ్ సింగ్, తల్లిని విచారించింది. అమృత్‌పాల్ సింగ్ కార్యకలాపాలకు విదేశీ నిధులు సమకూర్చిన ఆరోపణలపై కిరణ్‌దీప్ కౌర్‌ను పోలీసులు ప్రశ్నించారు. ఫండింగ్‌ గురించి పలు ప్రశ్నలు సంధించినట్టు తెలుస్తోంది..

ఇప్పుడు అమృత్పాల్ సింగ్ ను విడుదల చెయ్యాలని ఖలీస్తాన్ మద్దతుదారులు రెచ్చిపోతున్న సంగతి తెలిసిందే.. తాజాగా సోషల్ మీడియాలో మరో వీడియోను పోస్ట్ చేశారు..హిందువుల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు..హిందుస్తానీలు, ముఖ్యంగా హిందువులు భగత్ సింగ్ బలిదాన్ దివస్‌ను పాటిస్తున్నారు.. అతనికి నివాళులర్పిస్తున్నారు, అయితే భగత్ సింగ్‌ను ద్రోహి అని, బ్రాహ్మణుల బూట్ లిక్కర్ అని పిలుస్తూ వ్యాఖ్యలు చెయ్యడం ఆ వీడియోలో ఉంది.. ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. ఇక ఈ వీడియో పై ఎలాంటి చర్చలు జరుగుతాయో చూడాలి… ఒకసారి ఎలా అన్నారో ఆ వీడియోను చూడండి..

Read more RELATED
Recommended to you

Latest news