రామ్ చరణ్ బర్త్ డే స్పెషల్ రేపు CDP రిలీజ్…

-

రామ్ చరణ్ ఆస్కార్ వేదిక వరకూ వెళ్లి వచ్చిన తరువాత ఈ నెల 27వ తేదీన జరుపుకుంటున్న పుట్టినరోజు ఇది. ఈ సారి ఆయన బర్త్ డే మరింత ప్రత్యేకతను సంతరించుకుంది. అందువలన రేపటి నుంచే ఈ సందడి మొదలు కానుంది. చరణ్ బర్త్ డే సందర్భాన్ని పురస్కరించుకుని, రేపు స్పెషల్ CDP ని రిలీజ్ చేయనున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ, అధికారిక పోస్టర్ ను కొంతసేపటి క్రితమే వదిలారు. రేపు సాయంత్రం 6 గంటలకి స్పెషల్ సీడీపీ రిలీజ్ ఉంటుందని స్పష్టం చేశారు. ఇక 26 .. 27వ తేదీల్లో చరణ్ మూవీ ‘ఆరెంజ్’ సెప్షల్ షోస్ వేస్తున్నారు.

ప్రస్తుతం చరణ్ .. శంకర్ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా చాలా వరకూ చిత్రీకరణను జరుపుకుంది. కియారా కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా, పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను పలకరించనుంది. ఆ తరువాత సినిమాను గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో చరణ్ చేయనున్నట్టు సమాచారం. చరణ్ బర్త్ డే ఇంకా నాలుగు రోజులు ఉన్న అప్పుడే అభిమానుల్లో సందడి మొదలైది.

 

 

Read more RELATED
Recommended to you

Latest news