‘విరూపాక్ష’ నుంచి ‘నచ్చావులే నచ్చావులే’ అంటూ ఫస్టు సింగిల్ రెడీ!

-

ఇటీవల ‘విరూపాక్ష’ టీజర్ విడుదలైన దగ్గర నుంచి ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. సాయితేజ్ హీరోగా ఈ సినిమాలో నటిస్తున్నారు. బీవీఎస్ ఎన్ ప్రసాద్ – సుకుమార్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. కార్తీక్ వర్మ దండు ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో సాయితేజ్ జోడీగా సంయుక్త మీనన్ అలరించనుంది. ఇటీవల టీజర్ వదిలిన దగ్గర నుంచి ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ‘నచ్చావులే నచ్చావులే’ అంటూ సాగే పాటను ఫస్టు సింగిల్ గా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Virupaksha Movie Update

రేపు ఈ పాటను రిలీజ్ చేయనున్నట్టుగా అధికారిక ప్రకటన చేస్తూ కొత్త పోస్టర్ ను వదిలారు. పంట పొలాల నేపథ్యంలో హీరో .. హీరోయిన్ రాళ్ల తెట్టెపై కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నట్టుగా ఉన్న ఈ పోస్టర్ ఆకట్టుకుంటోంది. అజనీశ్ లోక్ నాథ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. ఏప్రిల్ 21న ప్రేక్షకులముందుకు రానుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news