కియారా – సిద్దార్థ్ ల పెళ్లి సందడి షురూ..!

-

బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో క్యూట్ లవ్ జోడిగా గుర్తింపు తెచ్చుకున్న కియారా అద్వానీ – సిద్దార్థ్ మల్హోత్ర త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్నారు. ఈనెల 6వ తేదీన రాజస్థాన్ జై సల్మేరులోని సూర్య గడ్ ప్యాలెస్ లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరగబోతోంది. ఇప్పటికే నాలుగు రోజులపాటు జరిగే వివాహం కోసం భారీ స్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్యాలెస్ వద్ద ప్రత్యేక భద్రతను కూడా ఏర్పాటు చేయడంతో పాటు అతిధుల కోసం కళ్ళు చెదిరే ఏర్పాటు చేస్తోంది ఈ జంట. బాలీవుడ్ లో అత్యంత ఖరీదైన వివాహాలలో వీరిది కూడా ఒకటిగా నిలవబోతోంది.

మరొకవైపు కియారా – సిద్ధార్థ్ వారి కుటుంబ సభ్యులతో కలిసి శనివారం జై సల్మేర్ చేరుకున్నారు. ఆదివారం సంగీత కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇరు కుటుంబాల సభ్యులు ,కొంతమంది బాలీవుడ్ ప్రముఖులు మాత్రమే ఈ పెళ్లికి హాజరవుతున్నారని తెలుస్తోంది. అంతేకాదు ఈనెల 8వ తేదీ వరకు జరిగే అన్ని వేడుకలకు సంబంధించి విందు వినోద కార్యక్రమాలను ప్రత్యేకంగా నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా పెళ్లి ఫోటోలు బయటకు రాకుండా ఉండేందుకు అతిథులను వివాహ వేడుకల వద్దకు సెల్ఫోన్లతో అనుమతించడం లేదట. శనివారం సోషల్ మీడియాలో కంగనా రనౌత్ కూడా ఈ జంటకు శుభాకాంక్షలు తెలిపింది.

ఇన్ని రోజులు ప్రేమ పక్షులలా బయట విహరించిన ఈ జంట ఇప్పుడు వైవాహిక బంధం లోకి అడుగుపెడుతున్నారు. ఏది ఏమైనా ఈ జంట సంతోషంగా ఉండాలని అభిమానులు , సెలబ్రిటీలు కూడా పెళ్లి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news