కిరణ్ అబ్బవరం 9వ సినిమాకి రేపు రామానాయుడు స్టూడియోలో సన్నాహాలు

-

కిరణ్ అబ్బవరం నేటి తరం యువ హీరోలకు గట్టి పోటీనిస్తూ వరుస సినిమాలతో సక్సెస్ సాధిస్తూ ముందుకు దూసుకువెళ్తున్నారు. ఈ మధ్య కాలంలో వచ్చిన ‘వినరో భాగ్యము విష్ణు కథ’ సినిమా మంచి హిట్ గా నిలిచింది. ఆ తరువాత సినిమాగా ఆయన నుంచి ‘మీటర్’ రానుంది. ఈ నెల 17వ తేదీన ఈ సినిమా థియేటర్లలో రిలీస్ అవ్వనుంది. ఈ సినిమా విడుదలకు ముస్తాబవుతూ ఉండగానే, మరో ప్రాజెక్టును చేపట్టాడు కిరణ్. ఆ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రకటనను కొంతసేపటి క్రితం విడుదల చేశారు. శివమ్ బ్యానర్ పై రవి – రాకేశ్ రెడ్డి ఈ సినిమాను నిర్మించనున్నారు.

Kiran Abbavaram Movies, News, Photos, Age, Biography

కెరియర్ పరంగా కిరణ్ అబ్బవరం చేసే 9వ సినిమాగా ఈ సినిమా నిలుస్తుంది. హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో ఉదయం 7: 45 నిమిషాలకు ఈ సినిమా పూజా కార్యక్రమాలను జరుపుకోనుంది. గతంలో కొన్ని సినిమాలకి రైటర్ గా పనిచేసిన విశ్వకరుణ్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాతో కథనాయికగా నజియా పరిచయమవుతోంది. గతంలో ‘మిస్టర్ మజ్ను’ .. ‘ సోలో బ్రతుకే సో బెటర్’ అనే సినిమాల్లో గ్లామరస్ గా కనిపించింది నజియా.

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news