మహిళలందరూ ఈ యాప్‌ను డౌన్ లోడ్ చేసుకోవాలంటూ కిషన్ రెడ్డి విన్న‌పం..

-

దిశ ఉదంతం దేశవ్యాప్తంగా యువతలో ఉద్యమాన్ని రగిల్చిన వేళ, నేడు కూడా పార్లమెంట్ లో మహిళల రక్షణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి ప్రస్తావన వచ్చింది. ఈ సందర్భంగా కేంద్ర హోమ్ శాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ, “దేశంలోని మహిళలతో పాటు ప్రతి ఒక్కరికీ నేను ఒక్కటే విన్నపం చేస్తున్నాను.

ప్రతి ఒక్కరూ 112 ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ యాప్ ను ఫోన్లలో డౌన్ లోడ్ చేసుకోవాలి. ఇది దేశవ్యాప్తంగా ఎక్కడైనా వాడుకోవచ్చు. రైల్వే స్టేషన్లలో జీఆర్పీ, రైల్వే పోలీసులు, విమానాశ్రయాల్లో సీఐఎస్ఎఫ్ పోలీసులు స్పందిస్తారు. 112 హెల్ప్ లైన్ ను నిర్వహించేందుకు అన్ని రాష్ట్రాలకూ నిధులను కూడా అందించాం” అని కిషన్ రెడ్డి తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news