ప్రోటోకాల్ వివాదం గురించి కిషన్ రెడ్డి స్పందన.. పట్టించుకోను !

-

ఈరోజు ఉదయం తన పర్యటన సంధర్భంగా జీహెచ్ఎంసీ అధికారులు ఎవరూ రాలేదని చెబుతూ కిషన్ రెడ్డి సీరియస్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ అంశం మీద ఆయన స్పందించారు. స్థానిక పార్లమెంట్ సభ్యునిగా నేను నియోజకవర్గం లో తిరిగానన్న ఆయన సదరు అధికారుల పై చర్యలు తీసుకోవాలని కోరనని అన్నారు. ఈ ప్రోటోకాల్ విషయాన్ని తాను పట్టించుకోనని అన్నారు.

అలానే ఇప్పుడు జరిగిన నష్టం పై రాష్ట్ర ప్రభుత్వం నివేదిక పంపించాక కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని, ఈ విషయం మీద దయచేసి రాజకీయాలు వద్దని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యమే ఈ పరిస్థితికి కారణమన్న ఆయన ప్రతి సమ్మర్ లో నాలల్లో సిల్ట్ తీసే సంప్రదాయం ఉండేదని, కానీ కాంట్రాక్టర్లు తూతూ మంత్రంగా పై పై పూడిక తీస్తున్నారని అన్నారు. దాని పర్యవసానమే ఇప్పటి ఈ పరిస్థితి అని ఆయన అన్నారు. వర్షపు నీరు పోయే పరిస్థితి లేదని పేర్కొన్న అయన ఇప్పటికైనా ప్రభుత్వం మౌలిక వసతుల పై దృష్టి పెట్టాల్సి ఉందని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news