స్వయంగా కేటీఆరే వచ్చినా మేం చేర్చుకోం : కిషన్ రెడ్డి

-

‘టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర’ వ్యవహారంలో ఆ పార్టీ నేతల వైఖరి కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుగా ఉందని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి అన్నారు. ఈ కేసులో బీజేపీ నేతలపై సీఎం కేసీఆర్‌ ఆరోపణలు చేస్తూ వీడియోలు ప్రదర్శించిన నేపథ్యంలో ఆయన స్పందించారు. ఇది కేసీఆర్ రాసిన కట్టుకథ అని అన్నారు.

కేసీఆర్‌ ప్రభుత్వాన్ని కూలగొట్టే విధంగా వీడియోలో ఎక్కడా లేదని.. టీఆర్ఎస్ ప్రభుత్వం అంత బలహీనంగా ఉందా? అని ప్రశ్నించారు. బయటి వ్యక్తులతో బేరసారాలు చేయాల్సిన కర్మ తమ పార్టీకి పట్టలేదన్న ఆయన.. కేసీఆర్​కు వెన్నుపోటు పొడిచి కేటీఆర్​ వచ్చినా చేర్చుకోమన్నారు. భాజపా ప్రజాస్వామ్యబద్ధంగా అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు.

‘‘కేసీఆర్‌ ఊహాజనితమైన ఆలోచన నుంచి పుట్టిందే ఈ కథ. స్వామీజీలతో ఎక్కడైనా ప్రభుత్వాలు కూలిపోతాయా? ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి నీతిమంతుడైనట్లు చెబుతున్నారు. తెలంగాణ రత్నాలని చెబుతున్న నలుగురు ఎమ్మెల్యేల్లో ముగ్గురు ఏ పార్టీ నుంచి గెలిచారు? మీరా ప్రజాస్వామ్యం గురించి నీతులు వళ్లించేది? ప్రెస్‌మీట్‌లో కేసీఆర్‌ పాత రికార్డులనే మళ్లీ తిరగతోడారు. తన అసహనం, ఆక్రోశం, అభద్రతా భావాన్ని మరోసారి ఆయన ఏకరువు పెట్టారు. తనకి తానే సీఎం పదవిని చులకన చేస్తూ మాట్లాడారు. బ్రోకర్ల ద్వారా నేతలను పార్టీలో చేర్పించుకునే అలవాటు మీకు ఉందేమో.. మాకు లేదు.” అని కిషన్ రెడ్డి అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news