కేసీఆర్ ప్రధాని.. కేటీఆర్ సీఎం అయినట్లు కలలు కంటున్నారు : కిషన్ రెడ్డి

-

ముఖ్యమంత్రి కేసీఆర్ ను దేశంలో ఎవరూ నమ్మడం లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కేసీఆర్ కొత్త పార్టీ పెట్టినట్లు, అప్పుడే కేసీఆర్ ప్రధాని అయిపోయినట్లు.. కేటీఆర్ సీఎం అయినట్లు కల్వకుంట్ల కుటుంబం పగటికలలు కంటోందని ఎద్దేవా చేశారు. ఎంఐఎంను బలోపేతం చేయడానికే కేసీఆర్ కొత్త పార్టీ ఏర్పాటు చేస్తున్నారని ఆరోపించారు. ప్రగతి భవన్‌కు అసదుద్దీన్‌ ఒవైసీ బుల్లెట్ బండిపై నేరుగా వెళ్లే స్వేచ్ఛ ఉందని గుర్తు చేశారు.

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

టీఆర్ఎస్‌ కు మిగిలిన ఏకైక మిత్రపక్షం ఎంఐఎం మాత్రమే అని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే కొత్త పార్టీ పెడుతున్నారంటూ విమర్శించారు. కేసీఆర్ ఏ లక్ష్యంతో కొత్త పార్టీ పెడుతున్నారో టీఆర్ఎస్ నేతలే అర్థం కాక తలలు పట్టుకుంటున్నారని కేంద్ర మంత్రి అన్నారు.

మునుగోడులో బీజేపీనే ఘన విజయం సాధిస్తుందని కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మునుగోడు ఉప ఎన్నిక కోసం బీజేపీ సిద్ధంగా ఉందని తెలిపారు. భారీ మెజారిటీతో గెలుస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. మరోవైపు మునుగోడులో గెలుస్తామని కేసీఆర్ ఉత్తర కుమారుడిలా ప్రగల్బాలు పలుకుతున్నారని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news