NTR 30లో మహేష్ బాబు హీరోయిన్ !

-

జూనియర్‌ ఎన్టీఆర్‌, కొరటాల శివ కాంబోలో ఎన్టీఆర్‌ 30 వ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో వచ్చిన జనతా గ్యారేజ్‌ సినిమా విజయం సాధించింది. ఈ నేపథ్యంలో మరో సినిమాకు సన్నద్ధం అవుతున్నారు. ఇప్పటికే ఈ సినిమా ప్రారంభం కావాల్సి ఉంది. కానీ ఆర్‌ ఆర్‌ఆర్‌ సినిమా షూటింగ్‌ కారణంగా ఈ సినిమా ప్రారంభం వాయిదా పడుతూ వస్తోంది.

ఈ సినిమాకు కొరటాల దర్శకత్వం వహిస్తుండగా.. మిక్కిలినేని సుధాకర్‌ తో కలిసి కళ్యాణ్‌ రామ్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పాన్‌ ఇండియా లెవెల్ లోనే ఈ సినిమాప్రేక్షకుల ముందుకు రానుందనే టాక్‌ నడుస్తోంది.

ఈ సినిమాలో బస్తీకి చెందిన యువకుడిగా.. బస్తీ విద్యార్థుల హక్కుల కోసం పోరాడే స్టూడెంట్‌ లీడర్‌ గా ఎన్టీఆర్‌ కనివిందు చేయనున్నాడట. అయితే.. తాజాగా ఈ సినిమాను ఓ అప్డేట్‌ వచ్చింది. ఈ సినిమాలో బాలీవుడ్‌ హీరోయిన్‌ అలీయా భట్‌ నటించే ఛాన్స్‌ ఉందని…మొన్నటి వరకు ప్రచారం జరుగగా.. ఇప్పుడు కియారా అద్వానీ నటిస్తున్నట్లు సమాచారం అందుతోంది. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది.

Read more RELATED
Recommended to you

Latest news