వాస్తు శాస్త్రాన్ని అనుసరించి ఎన్నో నియమాలను పాటిస్తాం. ఈ రోజు కూడా ఓ పరిహారాన్ని పాటించడం వల్ల రోగాలకు దూరంగా ఉండటం ఎలాగో తెలుసుకుందాం. ఉప్పుతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఇది ఇంట్లో ఉండే నెగిటీవ్ ఎనర్జీని తరిమేస్తుంది. దీంతో అటువంటి ఇంట్లో ఉండేవారు కూడా సుఖసంతోషాలతో ఉంటారు. ఇంట్లో ఏవైనా వాస్తు దోషాలు ఉంటే ఉప్పును ఇంటి మూలలో పెట్టడం వల్ల అది తొలగిపోతుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతారు.
అయితే ఈ ఉప్పుతో రోగాలకు చెక్ పెట్టే శక్తి కూడా ఉంటుందట. ఆ వివరాలు తెలుసుకుందాం. సాధారణంగా ఇంట్లో ఎవరికైనా ఒంట్లో బాగాలేకపోయినా… లేదా ఏదైనా రోగంతో బాధపడుతున్నా.. కుటుంబసభ్యులు కూడా ఆందోళన పడతారు. ఆ ఇంటి వాతావరణం కూడా మారిపోతుంది. ఈ నేపథ్యంలో కల్లు ఉప్పును అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తి గదిలో ఏదైనా ఒక మూలలో పెట్టాలి. ఆ వ్యక్తి కూడా కచ్చితంగా తూర్పు దిశగా తల పెట్టి పడుకోవాలి. ఆ వ్యక్తి ఆహారంలో కూడా రాక్ సాల్ట్ లేదా బ్లాక్ సాల్ట్‌ను మాత్రమే ఇవ్వాలి. రోజూవారీ మనం ఇళ్లలో వాడే సాధారణ ఉప్పు వాడకాన్ని తగ్గించాలి. దీంతో సదరు వ్యక్తి రానురాను మెరుగుపడుతుంది. ఇంట్లో కూడా పాజిటీవ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. ఆ ఇళ్లు ఆహ్లాదకరంగా మారిపోతుంది.