కరోనా విజృంభిస్తోంది.. వ్యాక్సిన్ వచ్చేసింది… మీకు తెలియని విషయాలివే.

-

2020కరోనా నామ సంవత్సరం అని చెప్తే అందులో అతిశయోక్తి లేదేమో. మార్చిలో మొదలైన కరోనా విజృంభణ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. భారతదేశంలో ప్రస్తుతం కరోనా ఉధృతి తగ్గిన మాట నిజమే. కానీ యూరప్ లో కరోనా ప్రవాహం చాలా వేగంగా ఉంది. కొత్త సంవత్సరంలో కరోనా కొత్త రూపు దాల్చుకుని మరీ తన పంజా విసురుతుంది. ప్రస్తుతం యూరప్ లో లాక్డౌన్ విధించారు. ఐతే ఇండియాలో కరోనాకి వ్యాక్సిన్లు వచ్చేసాయి. అత్యవసర పరిస్థితుల్లో వ్యాక్సిన్ ఉపయోగించేందుకు భారత ప్రభుత్వం కరోనా వ్యాక్సిన్లకి అనుమతులు ఇచ్చింది.

హైదరాబాద్ కి భారత్ బయోటెక్ సంస్థ కోవ్యాక్సిన్ ని తయారు చేసింది. పుణెలో ఉన్న సీరమ్ సంస్థ ఆక్స్ ఫర్డ్ తో కలిసి కోవిషీల్డ్ వ్యాక్సిన్ ని ఉత్పత్తి చేస్తుంది. ఐతే ఈ రెండు వ్యాక్సిన్లని భారత ప్రభుత్వం ఆమోదించింది. ఈ మేరకు వ్యాక్సిన్ల గురించి తెలుసుకోవాల్సిన విషయాలేమిటంటే,

వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత తేలిక పాటి నొప్పులు, జ్వరం వంటి లక్షణాలు వస్తాయని, కాకపోతే భద్రత అత్యంత సురక్షితమని తెలిపింది. ఐతే వ్యాక్సిన్ వచ్చేసింది. మరి ఎప్పటి నుండి వ్యాక్సినేషన్ మొదలెడతారని చాలామందిలో కలుగుతున్న ప్రశ్న. ముందుగా, మూడు కోట్ల మంది ఆరోగ్య సిబ్బందికి వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. ఆ తర్వాత మూడు కోట్ల మందికి వ్యాక్సినేషన్ మొదలెడతారు. ప్రస్తుతానికి మిగతా వారికి వ్యాక్సినేషన్ చేయట్లేదు. ఆగస్టు తర్వాతే ఆ ప్రక్రియ ఉంటుంది.

కరోనా నుండి కోలుకున్నాక కూడా వ్యాక్సిన్ వేయించుకోవల్సిన అవసరం ఉంది. 28రోజుల వ్యవధిలో రెండు డోసుల టీకా వేయించుకోవాలి. ఐతే రెండు వేర్వేరు వ్యాక్సిన్లు తీసుకోవడానికి లేదు. వ్యాక్సిన్ వేయించుకోవాలనుకునే వారు కో-విన్ అనే సైటులో రిజిస్టర్ కావాల్సి ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news