సమ్మర్ లో కఠోరా వాటర్ తాగుతున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి..!

-

ఈ రెండు నెలల్లో ఎండలు విపరీతంగా ఉంటాయి. బాడీ డీహైడ్రేట్ అవుతుంది. మనకు కూలింగ్ ఉండేవి తాగాలనిపిస్తుంది. కానీ అస్తమానం ఫ్రిడ్జ్ లో వాటర్ తాగకూడదని వైద్యులు అంటున్నారు. పోనీ కూల్ డ్రింగ్స్ తాగుదాం మంటే.. అవి ఆరోగ్యానికి అంత మంచివి కావు. మరి బాడీని కూల్ చేసుకోవాడనికి ఏం చేయాలి.? మన శరీరానికి వేసివి తాపాన్ని తగ్గించి కూల్ చేసేది ఏడిబుల్ గమ్ (Edible Gum)దీన్నే కఠోరా (katira) అంటారు. ట్రగాకాంత్ (Tragacanth) అనే చెట్టు నుంచి ఊటకారుతుంది.. అది నిల్వ ఉండే కొద్ది.. డ్రై అయి గమ్ లా మారుతుంది. ఇందులో ఏం ఏం పోషకాలు ఉంటాయి, ఇది ఆరోగ్యానికి ఏ విధంగా మేలు చేస్తుంది అనేది ఈరోజు మనం తెలుసుకుందాం..

100 గ్రాముల కఠోరాలో ఉండే పోషకాలు

శక్తి 70 కాలరీలు
కార్భోహైడ్రేట్స్ 35 గ్రాములు
ఫైబర్ 30 గ్రాములు
యాంటిఆక్సిడెంట్స్ 62 మిల్లీగ్రాములు

30-40 గ్రాములు తీసుకుని రెండు లీటర్ల వాటర్ లో వేస్తే.. ఆ నీరుని ఈ ఎడిబుల్ గమ్ పీల్చుకుని ఉబ్బుతుంది. దీన్ని రోజు మొత్తంలో అప్పుడప్పుడు తాగొచ్చు. బాడీ డీ హైడ్రేషన్ రాకుండా ఉపయోగపడుతుందని సైంటిఫిక్ గా ప్రూవ్ చేశారు. ఇంకా వాటర్ పీల్చుకునే గుణం వల్ల కిడ్నీలో ఉండే నెప్రాన్స్( Nephrons)ని ప్రొటెక్టీవ్ ప్రొపర్టీస్ కలిగి ఉంది అని కూడా నిరూపించారు. యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ తగ్గించడానికి బాగా పనికొస్తుందని కూడా కనుగొన్నారు. సమ్మర్ లో UTI సమస్య స్త్రీలకు బాగా ఉంటుంది. కిడ్నీలో స్టోన్ ఫార్మాషన్ జరగకుండా ఇది ఉపయోగపడుతుంది. సమ్మర్ లోనే ఈ సమస్య కూడా ఎక్కవ అవుతుంది.

ఇందులో ఉండే ఫైబర్ వల్ల.. మలబద్ధకం సమస్య బాగా తగ్గుతుంది. సమ్మర్ లో ఆవకాయ ఎక్కువగా తింటారు.. అప్పుడు ఇంకా ఈ మలబద్ధకం సమస్య ఎక్కువ అవుతుంది. ఈ కఠోరా వాటర్ తాగటం వల్ల సుఖవిరోచనం అవుతుంది. ఇంకా కొందరికి లూస్ మోషన్స్ అవుతుంటాయి. అది అరికట్టడానికి కూడా ఈ కఠోరా వాటర్ అద్భుతంగా పనికొస్తుంది. ఇందులో ఉన్న ఫైబర్ అంతా సాలిబుల్ ఫైబర్ కాబట్టి.. ఇది ప్రేగుల్లో రక్షణ వ్యవస్థను పెంచడానికి ఉపయోగపడే హెల్ప్ ఫుల్ బాక్టీరియాను పెంచుతుంది. ఇమ్యూనిటి ప్రేగుల్లో పెరుగుతుందని కూడా సైంటిఫిక్ గా నిరూపించారు.

ఇందులో యాంటీఆక్సిడెంట్స్ కూడా ఎక్కువ మోతాదులో ఉండటం వల్ల.. బాడీలో ఉత్పత్తి అయ్యే ఫ్రీ రాడికల్స్ ను రిమూవ్ చేయడానికి, ఆక్సిడేటివ్ స్ట్రస్ నుంచి శరీరంలో కణజాలాన్ని రక్షించడానికి ఉపయోగపడుతుంది. వీటితో పాటు.. సూపర్ బెనిఫిట్ ఏంటంటే.. ఇది యాంటి ఏజింగ్ గా ఉపయోగడుతుందని కూడా సైంటిఫిక్ గా కనుగొన్నారు. వయసు పెరుగుతున్నా.. వయసు తెలియకుండా ఉంటాం..

ఇన్ని రకాల ప్రయోజనాలు కఠోరా వల్ల ఉంటాయని 2021వ సంవత్సంలో మషద్ యూనివర్శిటీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఇరాన్ (Mashhad University Of Medical Sciences- Iran) వారు 113 పరిశోధనా పత్రాల సారాంశం నుంచి సంగ్రహించి పైన పేర్కొన్న విషయాలను అందించారు. కాబట్టి.. ఈ సమ్మర్ కు ఎడిబుల్ గమ్ కఠోరాను డైలీ ఒక గ్లాస్ తాగడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి కాబట్టి మీరు ట్రై చేయమంటున్నారు ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు.

– Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news