ఏపీలో మూడు రాజధానుల అంశం పై వైసీపీ సర్కార్ వెనక్కి తగ్గిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి ఏపీ హైకోర్టులో అఫిడవిట్ కూడా దాఖలు చేశారు. అంతే కాకుండా మరికొద్ది సేపట్లో ప్రకటన కూడా విడుదల కానుంది. దాంతో ఏపీ ప్రజలంతా ఎలాంటి ప్రకటన చేస్తారా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి సమయంలో తాజాగా సీఎం జగన్ ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే వెనక్కి తగ్గే ప్రసక్తేలేదని మంత్రి కొడాలి నాని వ్యాఖ్యానించారు.
మూడు రాజధానుల బిల్లులో సాంకేతిక సమస్యలు ఉన్నాయని… ఈ కారణంగానే న్యాయస్థానంలో బిల్లులు నిలువలేకపోతున్నాయని కొడాలి నాని వ్యాఖ్యానించారు. అంతే కాకుండా ముఖ్యమంత్రి జగన్ ఒక్కసారి నిర్నయం తీసుకుంటే వెనక్కి తగ్గే ప్రసక్తే ఉండదని అన్నారు. పదినిమిషాలు ఆగితే అన్ని విషయాలపై క్లారిటీ వస్తుందని కొడాలి వ్యాఖ్యానించారు. ఇక కొడాలి నాని వ్యాఖ్యలతో ఏపీ సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందా అన్న ఉత్కంట మరింత పెరిగింది.