ఇంటి పోరు ఇంతింత కాదు
ఇంతి పోరు కూడా ఇంతింత కాదు
మార్చుకోండి ఆ కవితా పంక్తి ని
లేదా జీవిత సూక్తిని
మారేది మార్చేది ములాయం కూడా!
ములాయం ఇంట్లో ముసలం మొదలయింది.అసలే ఎన్నికలు ఆపై చలికాలం ఇంతలో ఈ వేడి సెగలు ఏంటో కానీ ఫలితం ఎలా ఉన్నా పోరు తప్పదు కదా! అందుకు సమాయత్తం అవుతున్నతరుణంలో సొంత ఇంటి నుంచే శత్రు మూకల దాడి మొదలయిం ది. దీనిని తట్టుకునే విధంగా ములాయం ఉన్నారో లేదో కానీ కోడలి పిల్ల మాత్రం భలే స్పీడుగా ఉన్నారు.బీజేపీ గూటికి చేరి మోడీజీకి అండగా ఉంటానని బాహాటంగానే చెబుతోంది. ఈ క్రమంలో నాటకీయ పరిణామాల నేపథ్యంలో వచ్చే మార్పులు రేపటి వేళ యూపీని ఏ దిశగా నడపనున్నాయో ?
ఎన్నికలు ఏమయినా గమ్మత్తుగానే ఉంటాయి.ఉండాలి కూడా! యూపీ ఎన్నికలు ఇందుకు భిన్నం కాదు.మినహాయింపు అంత కన్నా కాదు.ఇక్కడ ఎన్నికలు కారణంగా బీజేపీ చాలా బలంగా ఉంది అని చెప్పుకునేందుకు చాలా అవస్థలు పడుతోంది. పోనీ బీజేపీ బలంగా లేదనుకుంటే ఏదో ఒక పార్టీ బలంగా ఉందని ఆ స్థానం తమదేనని యోగిని పదవీచ్యితుడ్ని చేయాలని యోచిస్తున్నాయి.ఈ క్రమంలోనే బీజేపీ,ఎస్పీ యుద్ధం ఎక్కడికో వెళ్లనుంది. కాంగ్రెస్,బీఎస్పీ లాంటి శక్తులు కూడా పాపం తమ వంతు ప్రయత్నం మరియు ప్రచారం కూడా చేస్తున్నా యోగీ అనే ఓపెద్ద కొండను తాము ఢీ కొనలేమని కొందరు విపక్ష అభ్యర్థులు చేతులెత్తేస్తున్నారు.
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న తరుణాన ఉత్తర ప్రదేశ్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కుతున్నాయి.అంతా ఊహించిన తీరు కన్నా భిన్నంగా ఇక్కడ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ కోడలు అపర్ణా యాదవ్ తాజాగా ట్విస్ట్ ఇచ్చారు. ఆమె పార్టీకిగుడ్ బై చెబితే చెప్పారు కానీ పాపం మామను కన్ ఫ్యూజ్ చేస్తున్నారు. ఆఖరికి ఎన్నోసార్లు మోడీని బాహాటంగానే సమర్థించిన ఆమె అదే పంథాను కొనసాగించి ఇప్పుడు బీజేపీ గూటికి చేరిపోతున్నారు. దీంతో ఏం చేయాలో పాలుపోక ములాయం జుత్తు పీక్కుంటున్నాడు.