‘కోడి’ చేసిన హత్య… చిత్తూర్ జిల్లాలో విషాదం.

-

కోడి హత్య చేస్తుందంటే ఎవరైనా నమ్ముతారా.. కానీ ఇది అక్షర సత్యం. కోళ్ల పందాలను చూడటానికి రావడమే పాపమైంది. కలలో కూడా ఎవ్వరూ ఊహించని ఘటన జరిగింది. కోడి దాడిలో ఓ యువకుడు మరణించి ఆశ్చర్యకరమైన ఈ ఘటన చిత్తూర్ జిల్లాలో జరిగింది. కోడి దాడితో ఓ యువకుడు మరణించడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.

వివరాల్లోకి వెళ్తే చిత్తూర్ జిల్లాలో జరిగిన ఈ ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. చిత్తూర్ జిల్లా తంబళ్లపల్లి మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి దశదిన కర్మ సందర్భంగా కోడి పందాలు నిర్వహించారు. ఈ పందాలను చూసేందుకు చాలా మంది వచ్చారు. పందాలు జరుగుతున్న సందర్భంలో హఠాత్తుగా కోడి ఓ యువకుడిపైమ దాడి చేసింది. దీంతో కోడికి ఉన్న కత్తి గుచ్చుకుంది. దీంతో యువకుడిని హస్పటల్ తీసుకుని వెళ్లే లోపే యువకుడు మరణించాడు. అయితే కోడి కత్తికి విషం పూసి ఉందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news