రోజాకు డ్యామేజ్ తగ్గదా?

-

రాజకీయాల్లో ఏదో అనుకుంటే ఏదో జరగడం అనేది కొంతమంది నాయకులకు జరుగుతుందని చెప్పొచ్చు…రాజకీయంగా ఏదో చేసేద్దామని అనుకుంటారు..కానీ అదే రివర్స్ అయ్యి ఫెయిల్ అవుతారు. ఇప్పుడు నగరి వైసీపీ ఎమ్మెల్యే రోజా పరిస్తితి తయారవుతుంది..పాపం ఈమె ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తిరుగులేకుండా ఉన్నారు. ఈమె చాలా దూకుడుగా ఉంటూ అప్పుడు అధికార పార్టీ టీడీపీపై ఫైర్ అవుతూ ఉండేవారు. జగన్‌పై ఎవరైనా విమర్శలు చేస్తే చాలు…వెంటనే వారికి కౌంటర్లు ఇచ్చేసేవారు.

అలా వైసీపీలో ఫైర్ బ్రాండ్‌గా ఉన్న రోజాకు అధికారంలోకి రాగానే మంత్రి పదవి వస్తుందని అంతా అనుకున్నారు..కానీ మొత్తం రివర్స్ అయింది…మంత్రి పదవి కాదు కదా..ఇప్పుడే ఎమ్మెల్యే పదవీకే ఎర్త్ వచ్చి పడింది. నగరి నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన రోజాకు…జగన్ క్యాబినెట్‌లో చోటు దక్కుతుందని అంతా అనుకున్నారు…కానీ సామాజికవర్గాల సమీకరణాల్లో భాగంగా ఆమెకు పదవి దక్కలేదు. అయితే ఏ‌పి‌ఐ‌సి‌సి ఛైర్మన్ పదవి దక్కింది. కానీ ఆ పదవి కూడా ఎక్కువ రోజులు నిలబడలేదు.

సరే పదవి లేకపోయినా సరే రోజా, జగన్ కోసం పనిచేస్తున్నారు…కానీ సొంత పార్టీ నేతల నుంచే ఆమెకు తలనొప్పులు ఎదురవుతున్నాయి. ఇప్పటికే నగరిలో కొందరు నేతలు రోజాకు వ్యతిరేకంగా పనిచేస్తున్న విషయం తెలిసిందే. రోజాతో సంబంధం లేకుండా వారు..నగరిలో కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ అంశం రోజాకు బాగా ఇబ్బంది అయిపోయింది. పైగా ఇటీవల వ్యతిరేక వర్గానికి పదవులు వచ్చాయి…దీంతో రోజాకు మరింత ఇబ్బందులు పెరిగాయి.

అదే సమయంలో ప్రత్యర్ధి పార్టీ టీడీపీ కూడా దూకుడు పెంచింది..టీడీపీ నేత గాలి భాను సైతం..రోజాకు చెక్ పెట్టాలని చెప్పి ప్రయత్నాలు మొదలుపెట్టారు..రోజాపై అనేక ఆరోపణలు గుప్పిస్తున్నారు..ఆమె కోట్ల ఆస్తులు వెనుకేసుకొచ్చిందని ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలకు రోజా కౌంటర్లు ఇస్తున్నారు. కానీ నగరిలో రోజాకు జరగాల్సిన డ్యామేజ్ మాత్రం జరిగిపోయినట్లు కనిపిస్తోంది. ఓ వైపు సొంత పార్టీ, మరో వైపు టీడీపీతో రోజాకు తలనొప్పి పెరిగింది..మరి ఈ పరిస్తితి నగరిలో రోజాకు మరింత డ్యామేజ్ పెంచుతుందేమో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news