ఐపీఎల్: కోహ్లీ చితక్కొట్టాడు.. చెన్నై లక్ష్యం 170..

-

చెన్నై సూపర్ కింగ్స్ తో తలపడుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టాస్ గెలిచి బ్యాటింగ్ కి దిగింది. మొదట్లో మెల్లగా ఆడిన బ్యాట్స్ మెన్స్ 15ఓవర్లు వచ్చేసరికి కేవలం 100పరుగులు మాత్రమే చేయగలిగారు. ఈ నేపథ్యంలో జట్టు స్కోరు 150చేరుతుందా అనే అనుమానాలు మొదలయ్యాయి. కానీ కెప్టెన్ కోహ్లీ ఆటతీరుతో జట్టు స్కోరు 4వికెట్లు కోల్పోయి 169పరుగులు చేయగలిగింది. ఓపెనర్ గా వచ్చిన దేవ్ దత్ పడిక్కల్ 33పరుగులు (34బంతుల్లో 2ఫోర్లు, 1సిక్సర్) చేసాడు.

కోహ్లీ 90పరుగులు (50బంతుల్లో 4ఫోర్లు, 4సిక్సర్లు) చేసి నాటౌట్ గా నిలిచాడు. అటు పక్క శివమ్ దూబే కోహ్లీ కి మంచి భాగస్వామ్యం అందించాడు. శివమ్ దూబే 22 పరుగులు(14బంతుల్లో 2ఫోర్లు, 1సిక్సర్) చేసాడు. మిగతా వారిలో వాషింగ్టన్ సుందర్ 10పరుగులు చేసాడు. చెన్నై బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ రెండు వికెట్లు, దీపక్ చాహర్, సామ్ కరేన్ తలా ఒక వికెట్ తీసుకున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news