టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లి యువ ఆటగాళ్ళకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్టు కనపడుతుంది. గత కొంత కాలంగా అవకాశాలు ఇస్తున్నా సరే ఆడని యువ ఆటగాళ్ళను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేసినట్టు సమాచారం. ముఖ్యంగా జట్టులో కీలక ఆటగాళ్ళు గా భావిస్తున్న హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్, కెఎల్ రాహుల్ కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు కోహ్లి. వీళ్ళకు వరుస అవకాశాలు ఇస్తూ వస్తున్నాడు.
ఆడినా ఆడకపోయినా సరే జట్టులో వాళ్ళ స్థానానికి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. టెస్టుల్లో వృద్దిమాన్ సాహాను తీసుకున్నా వన్డేల్లో, టి20 ల్లో మాత్రం కోహ్లి పంత్ వైపే మొగ్గు చూపిస్తున్నాడు. అయినా సరే బాబు ఆడకుండా అమ్మాయిలతో చక్కర్లు కొడుతున్నాడని, అతని వయసు 22 ఏ అని ఆగ్రహంగా ఉన్న కోహ్లీ, విరామ సమయాల్లో విహారయాత్రలకు వెళ్లి సమయం వృధా చేసుకోవద్దని,
దేశవాళి మ్యాచుల్లో ఆడాలని, జట్టుకి నీ అవసరం ఉంది గాని నీ మీదే ఆధారపడటం లేదని చెప్పాడట. ఇక హార్దిక్ పాండ్యాకు అదే చెప్పినట్టు సమాచారం. ప్రస్తుత౦ గాయం కారణంగా జట్టుకి దూరంగా ఉన్న ఈ యువ ఆల్ రౌండర్ కి అదే చెప్పాడట. దేశవాళీ మ్యాచుల్లో ఆడాలని చెప్పాడట. నిర్విరామంగా క్రికెట్ ఆడితేనే అనుభవం అనేది పెరుగుతుందని, కెరీర్ మొదట్లో ఇలాంటివి వద్దని చెప్పేశాడట.