స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ అలవైకుంఠపురములో మరొక రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. యువ సంగీత దర్శకుడు ఎస్ ఎస్ థమన్, ఈ సినిమాకు అందించిన సాంగ్స్, ఎంత పెద్ద విజయాన్ని అందుకున్నాయో మనందరికీ తెలిసిందే. ఈ సాంగ్స్ ఇప్పటికే యూట్యూబ్ లో మిలియన్ల కొద్దీ వ్యూస్, లైక్స్ ని దక్కించుకోవడంతో పాటు సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు పెంచేయడం జరిగింది.

మరోవైపు ఈ సినిమాకు పోటీగా సూపర్ స్టార్ మహేష్ నటిస్తున్న సరిలేరు కూడా సరిగ్గా ఈ సినిమాకంటే ఒక రోజు ముందు రిలీజ్ అవుతుండడం, అలానే ఆ సినిమా యూనిట్ ప్రమోషన్స్ తో దూసుకెళ్తుండడంతో, వెంటనే అలర్ట్ అయిన అల మూవీ టీమ్, తమ సినిమాకు కూడా ఫుల్ స్వింగ్ లో ప్రమోషన్స్ షురూ చేశారు. అందులో భాగంగా అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ నిన్న మీడియా వారికి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఇక నేడు ఈ సినిమా మేకింగ్ వీడియోని యూట్యూబ్ లో రిలీజ్ చేసింది సినిమా యూనిట్.
ఇక ఈ వీడియోలో యూనిట్ సభ్యులుతో పాటు నటీనటులు అందరూ కూడా షూటింగ్ సమయంలో ఎంతో ఎంజాయ్ చేస్తూ గడపడం గమనించవచ్చు. ఇక షూటింగ్ సమయంలో బన్నీ పిల్లలతో పాటు హీరో విక్టరీ వెంకటేష్ కూడా ఈ సినిమా షూటింగ్ సమయంలో విచ్చేసిన ఘటనలు మేకింగ్ వీడియోలో చూపించారు. ఇక ప్రస్తుతం ఈ వీడియో యూట్యూబ్ లో మంచి వ్యూస్ తో దూసుకుపోవడంతో పాటు సినిమాపై ప్రేక్షకుల్లో, బన్నీ ఫ్యాన్స్ లో మంచి ఆసక్తిని పెంచిందని చెప్పాలి….!!