ఆ అల్లా దయతో కోహ్లీ సెంచరీ కొట్టాలి: పాకిస్తాన్ ఫ్యాన్స్

-

ఆసియా కప్ ఈ నెల 27 నుంచి సెప్టెంబర్ 11 వరకు జరగనుంది. ఆసియా కప్ లో భాగంగా ఆగస్టు 27న శ్రీలంక – ఆఫ్ఘనిస్తాన్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది.దీని తర్వాత ఆగస్టు 28 ఆదివారం రోజున భారత్ – పాకిస్తాన్ మధ్య పోరు జరగనుంది. ఈ నేపథ్యంలోనే.. తాజాగా దుబాయ్ లోను ఓ అరుదైన ఘటన చోటు చేసుకుంది. పాకిస్తాన్ కు చెందిన ఓ అభిమాని తన ఆరాధ్య క్రికెటర్ అయిన విరాట్ కోహ్లీతో ఫోటో దిగేందుకు రిస్క్ చేశాడు.

ఆసియా కప్ 2022 టోర్నీ కోసం దుబాయిలో సన్నదమవుతున్న కోహ్లీని కలిసేందుకు సెక్యూరిటీ కల్లుగప్పి భారత నెట్ ప్రాక్టీస్ సేషన్ దగ్గరకు వెళ్ళాడు. ఇక సదరు అభిమాని చర్యతో ఉలిక్కిపడ్డ భద్రతా సిబ్బంది అతన్ని అడ్డుకొని ఈడ్చుకెళ్లే ప్రయత్నం చేశారు. దాంతో అభిమాని ‘నేను పాకిస్తాన్ కు చెందిన క్రికెట్ అభిమానిని కోహ్లీతో ఫోటో దిగాలనుకుంటున్నాను’ అని గట్టిగా అరిచాడు.

ఇది విన్నవిరాట్ కోహ్లీ సెక్యూరిటీని వారించి సదరు అభిమానికి సెల్ఫీ ఇచ్చాడు. దాంతో ఆ పాక్ ఫ్యాన్ ఆనందానికి హద్దే లేకుండా పోయింది. అనంతరం ఆ అభిమానిని పాకిస్తాన్ కు చెందిన పాక్ టీవీ ఛానల్ ఇంటర్వ్యూ చేసింది. ఈ సందర్భంగా ఆ అభిమాని మాట్లాడుతూ, కోహ్లీనీ కలుసుకోవడం తన జన్మ ధన్యమైందని, ఆ అల్లా దయతో కోహ్లీ ఫామ్ లోకి రావాలని ఆకాంక్షించాడు.

Read more RELATED
Recommended to you

Latest news