హైదరాబాద్ ను కాపాడుకోవాల్సిన బాధ్యత బిజెపి కార్పొరేటర్లదేనని ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు బిజెపి obc మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్. రాష్ట్రంలో రాజకీయ వేడి రోజు రోజుకు పెరిగిపోయిందని.. రాష్ట్ర ప్రభుత్వం కుటుంబ, అవినీతి,అక్రమాల్లో కూరుకుపోయిందని మండిపడ్డారు. కేసీఆర్ అసహనంతో ఏమీ మాట్లాడుతున్నారో అర్ధం కావడం లేదని.. ప్రజాస్వామ్యయుతంగా ప్రజలకు భరోసా కల్పించేందుకు బండి సంజయ్ పాదయాత్ర కేసీఆర్ జీర్ణించుకోలేక పోతున్నారని ఫైర్ అయ్యారు.
బిజెపి నేతలపై TRS దాడులకు ఉసగొల్పుతుందని.. బెంగాల్ తరహా హింస రాజకీయాలకు TRS సర్కార్ తెర లేపిందని ఓ రేంజ్ లో రెచ్చి పోయారు.పాదయాత్రకు అనుమతిని ఇచ్చిన ప్రభుత్వం.. రద్దు చేయడం వెనుక అంతర్యం ఏంటీ అని ప్రశ్నించారు. పాదయాత్రపై దాడులు చేసే వారిని కట్టడి చేయకుండా.. పాదయాత్రను అడ్డుకోవడం సరైంది కాదని… హన్మకొండ ఆర్ట్స్ కళాశాల మైదానంలో నిర్వహించే సభను TRS అడ్డుకుంటుందని ఆగ్రహించారు కె.లక్ష్మణ్. మజ్లీస్ తో కలిసి trs మత విద్వేషాలు రెచ్చ గొడుతుందని.. హన్మకొండలో జరిగే బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.