ఏపీ పదోతరగతి ఫలితాలపై సీబీఐ విచారణ జరగాలి : కొల్లు రవీంద్ర

ఏపీ విద్యాశాఖ నిన్న పదో తరగతి ఫలితాలు విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ఫలితాల్లో 2 లక్షలకుపైగా విద్యార్థులు ఫెయిల్‌ అయ్యారు. దీంతో ఈ పదోతరగతి ఫలితాలు చర్చనీయాంశంగా మారాయి. ఈ ఫలితాలు ప్రభుత్వ వైఫల్యమేనని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. తాజాగా టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ ఇంత మంది విద్యార్థులు ఫెయిల్ కావడం ప్రభుత్వ వైఫల్యమే అని అన్నారు. దీనిపై సీబీఐ చేత విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

TDP leader Kollu Ravindra detained following protest against three capital  law for Andhra Pradesh | Deccan Herald

ఫలితాలను ప్రకటిస్తామన్న రోజు కాకుండా, మూడు రోజుల ఆలస్యంగా ఫలితాలను ఎందుకు ప్రకటించారని కొల్లు రవీంద్ర ప్రశ్నించారు. అమ్మఒడి ఆర్థిక భారాన్ని తగ్గించుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నించిందనే అనుమానం కలుగుతోందని కొల్లు రవీంద్ర అన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఆత్మ స్థైర్యాన్ని కోల్పోవద్దని, వీరి తరపున తెలుగుదేశం పార్టీ పోరాడుతుందని చెప్పారు. టీచర్లను రాష్ట్ర ప్రభుత్వం వేధించిందని విమర్శించారు.