కేసీఆర్ కు కోమటిరెడ్డి లేఖ.. పూర్తి మద్దతు అంటూ..?

-

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లుపై ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే . ఈ క్రమంలోనే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఏకంగా అసెంబ్లీలో కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా తీర్మానాలు కూడా చేశారు. ఇక ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఇటీవలే తెలంగాణ కాంగ్రెస్ నేత ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు లేఖ రాశారు. కేంద్రం తెచ్చిన వ్యవసాయ బిల్లు ద్వారా రైతులకు తీరని అన్యాయం జరుగుతుంది తెలిపిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ బిల్లును వ్యతిరేకించడంతో పాటు ఏకంగా అసెంబ్లీలో వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా తీర్మానం చేయాలి అంటూ కోరారు.

రాష్ట్ర ప్రభుత్వం ఇలా చేస్తే ఆ తీర్మానానికి తమ పార్టీ నుంచి పూర్తి మద్దతు ఉంటుంది అంటూ స్పష్టం చేశారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అంతేకాకుండా ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ఎల్ఆర్ఎస్ స్కీమ్ గురించి కూడా ప్రస్తావించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. ఎల్ఆరేస్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించాలి అంటూ కోరారు. ఎల్ఆర్ఎస్ ద్వారా ఎంతోమంది పేద ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడే అవకాశం ఉందని.. అందుకే ఎల్ఆర్ఎస్ రద్దు చేయాలని లేనిపక్షంలో ఏలాంటి ఫీజు లేకుండా ఎల్ఆర్ఎస్ అమలు చేయాలని సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news