కోనా వెంకట్ ఆపు నీ కహానీలు అంటున్న పవన్ ఫాన్స్ !

-

సినిమా ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ కి అత్యంత సన్నిహితుల్లో ఒకరు గా కోనా వెంకట్ పేరు వినబడేది. అయితే సరిగ్గా ఎన్నికల సమయంలో కోన వెంకట్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ కి రాజకీయ అనుభవం లేదని ప్రశ్నించడానికి రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ అధికారంలో ఉన్న చంద్రబాబును ప్రశ్నించాలి గాని ప్రతిపక్షంలో ఉన్నా ప్రతిపక్ష నేత జగన్ ని విమర్శించడం ఏమిటని షాకింగ్ కామెంట్ చేయడం జరిగింది.

Image result for కోన వెంకట్ pawan kalyan"

అంతేకాకుండా ఆ సమయంలో వైఎస్ జగన్ చేసిన పాదయాత్ర గురించి మాట్లాడుతూ ఆ విధంగా ఏ రాజకీయనాయకుడు చేయలేరని ప్రజా సమస్యలపై జగన్ కి ఉన్న అవగాహన మరే రాజకీయ నేతకు లేదని అప్పట్లో కోన వెంకట్ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఇప్పటికీ పవన్ కళ్యాణ్ అభిమానులకు జనసేన కార్యకర్తలకు గుర్తున్నాయి.

ఇటువంటి తరుణంలో తాజాగా పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడంతో కోన వెంకట్ తాజాగా పవన్ కళ్యాణ్ నీ ఉద్దేశించి సమాజంలో మార్పు తీసుకురావడానికి రాజకీయంలో అనుభవం లేకపోయినా కానీ పవన్ కళ్యాణ్ చాలా కష్టపడుతున్నాడు అని ఇటీవల కోన వెంకట్ పొగడటం జరిగింది. ఇంకా అనేక విషయాలు పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం గురించి పాజిటివ్ గా మాట్లాడారు. దీంతో కోన వెంకట్ పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి తాజాగా చేసిన వ్యాఖ్యలను పవన్ కళ్యాణ్ అభిమానులు తప్పుపడుతున్నారు. నువ్వు పెద్ద అవకాశవాది రాజకీయాల్లో ఉన్నప్పుడు అప్పుడు అలా మాట్లాడి ఇప్పుడు సినిమాల్లోకి పవన్ రాగానే ప్లేటు ఫిరాయించి మాట్లాడతావా..? ఆపు నీ కహానీలు కోన వెంకట్ అంటూ పవన్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news