కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వల్ల పార్టీకి చాలా నష్టం జరిగింది : కొండా సురేఖ

-

గాంధీభవన్ లో ఈరోజు పీసీసీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కొండా సురేఖ మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీకి నష్టం కలిగే మాట్లాడిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని పార్టీనుంచి సస్పెండ్ చేయాలని కొండా సురేఖ అన్నారు. కొండా సురేఖ మాటలకు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కల్పించుకుని వ్యక్తిగత అంశాలు వద్దంటూ సముదాయించారు. ఏదైనా ఉంటే ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రేకు చెప్పాలని సూచించారు. కాగా.. గాంధీ భవన్ లో కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో నేతలు వారి వారి అభిప్రాయాలను వెల్లడించారు. పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలను గురించి సలహాలు, సూచనలు ఇచ్చారు.

 

 

ఈక్రమంలో అందరం కలిసి పని చేయకపోవడం వల్లే గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమిపాలయిందని ఇప్పటికైనా అందరం కలిసి ఐకమత్యంతో పని చేయాల్సిన అవసరం ఉందని సూచించారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వల్ల పార్టీకి చాలా నష్టం జరిగిందని… ఆయనను పార్టీ నుంచి సస్సెండ్ చేయాలని అన్నారు. అయితే ఈ సందర్భంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కల్పించుకున్నారు. సమావేశం అజెండాలో ఉన్న అంశాలపైనే మాట్లాడాలని… వ్యక్తిగత అంశాలు, డిమాండ్లు, ఫిర్యాదులు ఏమైనా ఉంటే పార్టీ ఇన్ఛార్జ్ దృష్టికి తీసుకెళ్లాలని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news