కాంగ్రెస్ గూటికి కొండా దంపతులు

Konda surekha Joins Congress Party

తెరాస అసమ్మతి నేతలు కొండా సురేఖ, మురళీ దంపతులు బుధవారం కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ సమక్షంలో వారు కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కొండా సురేఖ మాట్లాడుతూ… తెలంగాణను అన్ని విధాలుగా తెరాస మోసం చేసింది అంటూ ఆరోపించారు.

టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో తెరాస ను ఓడించడమే ప్రధాన ధ్యేయంగా పని చేస్తామని ఆమె వివరించారు. అయితే రాహుల్ తో సమావేశానికి ముందే  బుధవారం ఉదయం 10 గంటల సమయంలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత గులాం నబీ ఆజాద్‌తో కొండా దంతపులు  భేటీ అయినట్టు తెలుస్తోంది. తమకు కేటాయించాల్సిన సీట్లపై పూర్తి స్థాయిలో హామీ తీసుకున్న అనంతరమే వారు పార్టీలో చేరినట్టు సమాచారం.