కొరటాల శివ దర్శకత్వంలో జూ ఎన్టీఆర్ NTR 30 సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం శివ తన ప్రాణం పెట్టి మరీ పనిచేస్తున్నాడట. వాస్తవానికి ఆచార్య సినిమా కంటే ముందు తెలుగు పరిశ్రమ లో రాజమౌళి తర్వాత స్థానం లో కొరటాల శివ వుండే వాడు. ఎందుకంటే అంతకు ముందు రాజమౌళి లాగానే వరస హిట్స్ తో ఒక్క ప్లాప్ లేకుండా వున్నాడు. కాని ఆచార్య దారుణ పరాజయంతో తన పరిస్థితి తలకిందులు అయ్యింది.
అప్పటి దాకా పొగిడిన వారే కామెంట్స్ చేయడం ప్రారంభించారు. ఆఖరికి చిరంజీవి కూడా డైరెక్టర్ ఎలా చేయమంటే మేము అలా చేశాము అని మొత్తం శివ పై నెట్టేసాడు. అదృష్టం కొద్ది శివ చేతుల్లో జూ ఎన్టీఆర్ డేట్స్ వున్నాయి. కాని శివ కు మళ్లీ ఇదో కొత్తరకం తల నొప్పి తెచ్చి పెట్టింది. ఎందుకంటే RRR జూ ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. తన నటనతో దేశ వ్యాప్తంగానే కాక ప్రపంచ స్థాయిలో ఫేమస్ అయ్యాడు.
దీంతో జూ ఎన్టీఆర్ తో కూర్చోని అతని సూచనలు తీసుకొని, స్క్రిప్ట్ వర్క్ మొత్తం మార్పు చేస్తున్నాడట. ఈ సినిమాతో తనకు బ్లాక్ బస్టర్ హిట్ రావాలి ,అదే విధంగా జూ ఎన్టీఆర్ క్రేజ్ తగ్గకుండా చూడాలని కసితో ఇది మళ్లీ తన మొదటి సినిమా గానే భావించి, రాత్రి పగలు కష్ట పడి పని చేస్తున్నాడట. ఇందుకోసం తన టీమ్ తో అనేక కథలతో కుస్తీ పడుతున్నాడని సన్నిహిత వర్గాలు అంటున్నాయి.