కరోనా కట్టడికి ప్రతి ఒక్కరు మాస్కు ధరించాలని వైద్యుల నుంచి ప్రభుత్వాల వరకు ప్రతి ఒక్కరూ చెబుతున్నారు. అయిన సమాజంలో ఇప్పటికీ కొందరు మాస్కులు ధరించకపోవడం పట్ల టాలీవుడ్ దర్శకడు కొరటాల శివ ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఇంత చెప్తున్నా మాస్కులు వేసుకోకుండా తిరిగితే బొత్తిగా మనకి, పశువులకి తేడా ఉండదు. ఈ వ్యాధి వ్యాప్తి తగ్గాలంటే ప్రస్తుతానికి అదొక్కటే మార్గం. దయచేసి మాస్కులు వేసుకుందాం.’ అని ఆయన ట్వీట్ చేశారు. తన సినిమాల్లోనూ సామాజిక బాధ్యతల్ని గుర్తుచేసే కొరటాల శివ.. కొద్ది రోజుల కిందట కూడా ఇదే తరహాలో సీరియస్ వ్యాఖ్యలు చేశారు.
ఇంత చెప్తున్నా మాస్కులు వేసుకోకుండా తిరిగితే బొత్తిగా మనకి, పశువులకి తేడా ఉండదు. ఈ వ్యాధి వ్యాప్తి తగ్గాలంటే ప్రస్తుతానికి అదొక్కటే మార్గం. దయచేసి మాస్కులు వేసుకుందాం(ముక్కు , మూతి కవరయ్యేలాగా. మెడ మీద కాదు). వేసుకోని వాళ్లకు పనిమాల చెబుదాం. 🙏
— koratala siva (@sivakoratala) July 21, 2020
ఇన్ఫెక్షన్ కు గురైనవాళ్లలో చాలా మంది ఆ విషయాన్ని దాచి పెడుతూ, వ్యాప్తికి కారణమవుతున్నారనే రిపోర్టుల నేపథ్యంలో అలాంటి వైఖరి సరికాదని, వైరస్ సోకినట్లు గుర్తించిన వెంటనే కనీసం ఇంట్లోవాళ్లకైనా చెప్పి భౌతిక దూరాన్ని పాటించాలని, తద్వారా అందరికీ మేలు చేసినట్లవుతుందని ఆయన సూచించారు. శివ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.