ఆంధ్రప్రదేశ్ లో నెల్లూరు జిల్లా రాజకీయాలు ఎప్పుడూ ప్రత్యేకంగా ఉంటాయి. తాజాగా నెల్లూరు జిల్లా టీడీపీలో జరిగిన ఒక మార్పు ఒక సీనియర్ నాయకుడిని ఆలోచనలో పడేసింది అని చెప్పాలి. గత ఎన్నికల నుండి నెల్లూరు సిటీ కి టీడీపీ ఇంచార్జి గా కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ఉన్న మాట వాస్తవమే. కానీ తాజాగా నిన్న చంద్రబాబు తీసుకున్న ఒక స్టెప్ చాలా మందికి షాక్ అని చెప్పాలి. గత ఎన్నికలో నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన నారాయణ, ఆ తర్వాత అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. దీనితో వచ్చే ఎన్నికల్లో కోటంరెడ్డి టీడీపీ తరపున పోటీ ఖాయం అని అనుచరులు అంతా అనుకున్నారు. కానీ గత రాత్రి చంద్రబాబు నెల్లూరు సిటీకి ఇంచార్జి గా తిరిగి నారాయణను నియమించాడు. దీనితో కోటంరెడ్డికి దిమ్మతిరిగినట్లయింది.
ఇప్పుడు ఏమి చెయ్యాలో అర్ధం కానీ పరిస్థితిలో ఉన్నాడు. చంద్రబాబు ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటాడు కోటంరెడ్డికి బదులుగా ఏమి చేయనున్నాడు అని కార్యకర్తలు ఎదురుచూస్తున్నారు.