హైదరాబాద్ నగరంలో కొత్తగూడ వద్ద ఫ్లై ఓవర్ ను ఆదివారం రోజున మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. మూడు కిలోమీటర్ల దూరం ఈ ఫ్లై ఓవర్ ను నిర్మించారు. 263 కోట్లతో ఈ ఫ్లై ఓవర్ ని నిర్మించారు. ఈ ఫ్లై ఓవర్ నిర్మాణంతో బొటానికల్ గార్డెన్, కొత్తగూడ, కొండాపూర్ జంక్షన్ లను కలిపేలా కొత్తగూడా ఫ్లై ఓవర్ ను నిర్మించారు. గచ్చిబౌలి నుండి మియాపూర్ కు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి హైటెక్ సిటీకి ఈ ఫ్లై ఓవర్ ద్వారా సులభంగా చేరుకునే విధంగా వెసులుబాటు దక్కనుంది.
మజీద్ బండ రోడ్డు నుండి బొటానికల్ గార్డెన్ జంక్షన్ వరకు 401 మీటర్ల ర్యాంపు, కొత్తగూడ జంక్షన్ నుంచి హైటెక్ సిటీ వైపు 383 మీటర్ల ర్యాంపు నిర్మించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. కెసిఆర్ నాయకత్వంలో హైదరాబాద్ ఎంతో అభివృద్ధి చెందుతుందన్నారు. ఎంతోమంది సోషల్ మీడియాలో మెసేజ్ లు పెడుతున్నారని చెప్పుకొచ్చారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కల్లుగా పనిచేస్తున్నామని.. చేసిన పనిని ప్రజలు గుర్తుంచుకోవాలని కోరారు.