ఆర్​ఎంసీ కమిటీ సమావేశం మరోసారి వాయిదా..!

-

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఆర్ఎంసీ కమిటీ సమావేశం మరోసారి వాయిదా పడనుంది. కొన్నాళ్లుగా వాయిదా పడుతూ వస్తోన్న కమిటీ ఐదో సమావేశం ఈ నెల 27వ తేదీన జరగాల్సి ఉంది. అయితే మరుసటి రోజు నుంచి కృష్ణా జలవివాదాల ట్రైబ్యునల్ విచారణ జరగనుండడంతో మరోసారి వాయిదా పడే అవకాశం ఉంది. ఈ 27న జరిగే సమావేశంపై రెండు రాష్ట్రాల అధికారులు, ఇంజనీర్లు దృష్టి సారించడంతో ఆర్​ఎంసీ సమావేశాన్ని నిలుపుదల చేసే ఆలోచనలో ఉన్నారు.

ట్రైబ్యునల్ విచారణ నేపథ్యంలో 27న జరగాల్సిన ఆర్ఎంసీ సమావేశాన్ని వాయిదా వేయాలని తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్​సీ మురళీధర్ కోరారు. ఈ మేరకు కేఆర్ఎంబీ సభ్యుడు, ఆర్ఎంసీ కన్వీనర్​కు ఆయన లేఖ రాశారు. అటు మైలవరం బ్రాంచ్ కాల్వకు వెంటనే మరమ్మత్తులు పూర్తి చేసేలా చూడాలని ఏపీ ప్రభుత్వం కృష్ణా బోర్డును కోరింది.

ఈ మేరకు ఏపీ ఈఎన్​సీ నారాయణరెడ్డి కేఆర్ఎంబీ సభ్య కార్యదర్శికి లేఖ రాశారు. నాగార్జునసాగర్ చివరి ఆయకట్టులో ఉన్న ఏపీ పొలాలకు సాగు నీరు అందాలంటే ఖమ్మం సీఈ పరిధిలోని మైలవరం బ్రాంచ్ కెనాల్ కు మరమ్మత్తులు చేసి పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. లేదంటే ఏపీకి చెందిన చివరి ఆయకట్టుపై ప్రభావం బాగా ఉంటుందని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news