మళ్లీ అధికారంలోకి వచ్చాక కలుద్దాం.. CII సదస్సులో కేటీఆర్

-

వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది తామేనని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ‘’మరికొన్ని నెలల్లో సాధారణ ఎన్నికలు జరగబోతున్నాయని.. ఈ ప్రభుత్వంలో ఇది సీఐఐ చివరి వార్షిక సదస్సు. భవిష్యత్తులో ఇలాంటి ఎన్నో సదస్సులు మా ప్రభుత్వం ఆధ్వర్యలోనే జరుగుతాయి. మనం ఇలా కలుస్తూనే ఉంటాం’’ అని వ్యాపారవేత్తలను ఉద్దేశించి మంత్రి కేటీ రామారావు అన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాలూ తెలంగాణతో సమానంగా అభివృద్ధి చెందితే అయిదు లక్షల కోట్ల (5 ట్రిలియన్‌) డాలర్ల ఆర్థిక వ్యవస్థ సాకారమయ్యేదని తెలిపారు.

హైదరాబాద్‌లో భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) తెలంగాణ విభాగం వార్షిక సమావేశంలో కేటీఆర్‌ ప్రసంగించారు. జీవశాస్త్ర రంగంలో పెట్టుబడులకు తెలంగాణలో విస్తృత అవకాశాలున్నాయని పేర్కొన్నారు. ‘2013తో పోలిస్తే ఈ రంగంలో పెట్టుబడులు రెట్టింపయ్యాయని చెప్పారు. ఇక్కడి నుంచి 900 కోట్ల డోసుల వ్యాక్సిన్లు ఉత్పత్తి అవుతున్నాయని వివరించారు. భారత్‌ బయోటెక్‌, బయోలాజికల్‌ లాంటి సంస్థలు ఇందుకు ఎంతో దోహదం చేస్తున్నాయని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news