బిజేపీ ఎంపీకి చుక్కలు చూపించిన కేటిఆర్…?

-

తెలంగాణాలో బిజెపి బలపడటం ఏమో గాని ఇప్పుడు రాజకీయంగా ఆ పార్టీ తెలంగాణాలో వేస్తున్న అడుగులు మాత్రం కాస్త ఆశ్చర్యంగానే ఉంటున్నాయి. రాజకీయాల్లో బలపడటం అనేది ప్రస్తుత పరిస్థితుల్లో చాలా కష్టం. ఇక జాతీయ పార్టీలు దక్షిణాదిలో ఇప్పుడు బలం కాపాడుకోవడం అనేది చాలా కష్టంగా మారింది. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ అయితే దక్షిణాది రాజకీయాల్లో చక్రం తిప్పడానికి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుంది.

అయినా సరే అది పెద్దగా ఫలించడం లేదని అంటున్నారు. వాస్తవానికి దక్షిణాదిలో బిజెపికి పెద్దగా క్యాడర్ లేదు. కేవలం ఒక్క కర్ణాటక లో మాత్రమే ఆ పార్టీకి కాస్తో కూస్తో బలం ఉంది. ఇప్పుడు అక్కడ అధికారంలో కూడా ఉంది. ఇక తెలంగాణా విషయానికి వస్తే ఆ పార్టీకి ఇక్కడ ఎన్ని విధాలుగా చూసినా సరే బలపడే అవకాశాలు లేవు. కాంగ్రెస్ కి ఇక్కడ ఓటు బ్యాంకు ఎక్కువ. తెరాస తిరుగులేని ఆధిపత్య౦ చెలాయిస్తుంది.

ఇక ప్రాంతీయ పార్టీలుగా ఉన్న టీడీపీ, తెలంగాణా జనసమితి కూడా కొన్ని విధాలుగా బలపడే ప్రయత్నాల్లో ఉన్నాయి. ఈ తరుణంలో బిజెపి పనికి రాని రాజకీయం చేయడం మొదలుపెట్టింది. ఇటీవల ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో తెరాస నేతలు ఇద్దరినీ ఆ పార్టీ ఎంపీ బండి సంజయ్ కలిసారు. పార్టీలోకి వస్తే పదవులు ఇస్తామని ఆఫర్ చేసారు. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత ఈ చర్చలు జరిగాయి.

ఆ విషయం వెంటనే ఇద్దరు కార్యకర్తల ద్వారా కేటిఆర్ కి తెలిసింది. వెంటనే వాళ్ళతో మాట్లాడిన కేటిఆర్ అసలు విషయం మొహం మీదే అడిగేశారు. వెంటనే కూల్ గా వాళ్లకు ప్రగతి భవన్ నుంచి పిలుపు వచ్చింది, జరిగింది మొత్తం కేటిఆర్ ముందు పెట్టారు ఆ ఇద్దరు. వెంటనే ఎంపీ గారి సన్నిహిత వర్గం మొత్తంతో తెరాస తో టచ్ లోకి వచ్చింది. ఉగాది తర్వాత ఉమ్మడి కరీంనగర్ లో ఉన్న బిజెపి కీలక నేతలు తెరాస తీర్ధం పుచ్చుకోవడానికి రెడీ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news