జీతం తీసుకుంటున్న ప్రతీ ఉద్యోగి ఈ చట్టాల గురించి తెలుసుకోవాలి..!

-

జీతం తీసుకుంటున్న ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలని తప్పక చూడాలి. ముఖ్యమైన ఐదు చట్టాల గురించి తెలుసుకోవాలి. ఈ మధ్యకాలంలో ఉద్యోగులు వాళ్ళకి న్యాయం చేయాలని కార్పొరేట్ పెద్దలను కోర్టుకి తీసుకు వెళుతున్నారు ఉద్యోగస్తులు. గత ఏడాది ఐటి కంపెనీ ఇన్ఫోసిస్ కి ఉపాధి ఒప్పందాలలో పోటీ లేని నిబంధన పై సెంట్రల్ లేబర్ కమిషనర్ సమన్లు పంపింది కర్ణాటక కార్మిక శాఖ కూడా సమన్లు పంపింది.

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ 2017లో తొలగించిన ఉద్యోగిని మళ్లీ ఉద్యోగంలోకి తీసుకోవాలని చెన్నైలోని కోర్టు చెప్పింది. అతని జీవితం అలానే ప్రయోజనాలని పూర్తిగా ఏడేళ్ల పాటు చెల్లించాలని చెప్పింది. కీలక చట్టాల గురించి ప్రతి ఉద్యోగి తెలుసుకోవాలి మరి ఇక వాటికోసం చూసేద్దాం.

పారిశ్రామిక వివాదాల చట్టం, 1947 ప్రకారం కార్మిక కమిషనర్‌కు కార్మిక కమిషనర్‌కు సయోధ్య అధికారులుగా తెలియజేయబడింది. వారు ప్రస్తుతం ఉన్న లేదా పట్టుబడిన పారిశ్రామిక వివాదాలను తీసుకుంటారు మరియు కార్మికులు మరియు నిర్వహణల మధ్య చర్చల సదుపాయం ద్వారా పరిష్కరిస్తారు. ఈ చట్టం యొక్క ప్రధాన మరియు అంతిమ లక్ష్యం ఇమ్తితంటే.. “భారతదేశంలో పరిశ్రమలో శాంతియుత పని సంస్కృతిని నిర్వహించడం”, ఇది చట్టంలోని వస్తువులు & కారణాల స్టేట్‌మెంట్ కింద స్పష్టంగా అందించబడింది.

‘వర్క్‌మ్యాన్’ కేటగిరీలోని వ్యక్తులకు సెక్షన్ 25 కీలకమైనది. అలానే ఉద్యోగస్తులు సంతకం చేసే డాక్యుమెంట్స్ లో యజమానులు పే-అవుట్ ప్రయోజనాలు, నోటీసు వ్యవధి మరియు భీమాకి సంబంధించిన నిబంధనలను రాయడం ముఖ్యము. పత్రంపై సంతకం చేసేటప్పుడు ఉద్యోగులు జాగ్రత్తగా ఉండాలి. జీతం మాత్రమే కాకుండా ఇవన్నీ చూడాల్సిన అవసరం వుంది.

ఉద్యోగిని తొలగించినట్లయితే అర్హతల నిబంధనలు కూడా ఉద్యోగులతో చెప్పాలి. ఏదైనా నిబంధనను ఉల్లంఘించిన సందర్భంలో పేర్కొన్న నిబంధనలు మరియు షరతులను నెరవేర్చనందుకు ఉద్యోగి కోర్టును ఆశ్రయించవచ్చు. పని ప్రదేశాల్లో మహిళల పై లైంగిక వేధింపుల (నివారణ, నిషేధం, సంస్కరణ) చట్టం, 2013 భారతదేశంలో మహిళలకు కార్యాలయాల్లో లైంగిక వేధింపుల నించి రక్షణ కలిగించటానికి ఏర్పాటు చేసారు.

ఈ బిల్ కి ప్రధాని 2013 ఏప్రిల్ 23న అమోదం ఇచ్చారు. ఈ చట్టానికి లొంగని ఏ ఉద్యోగిపై అయినా కఠిన చర్యలు తీసుకుంటారు. ఇదే కాక అశ్లీల చిత్రాలను చూపడం లైంగిక స్వభావం తో ఇతర అసహ్యకరమైన శారీరక, శబ్ద లేదా అశాబ్దిక ప్రవర్తన వంటివి కూడా తప్పే. ఇలాంటివి చేసి మహిళా సహోద్యోగులకు కార్యాలయంలో అసౌకర్యం కల్గించకూడదు.

రిటైరయ్యాక కానీ ఉద్యోగం వదిలేసినా, తొలగించినా కంపెనీ ఆ వ్యక్తికి గ్రాట్యుటీని చెల్లిస్తుంది. 1972లో గ్రాట్యుటీ చెల్లింపు చట్టం (పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ యాక్ట్, 1972) రూపొందించింది. కంపెనీలు నిర్ధారిత నియమాలు, షరతులకు దీని ప్రకారమే లోబడి వుంటారు.గ్రాట్యుటీ చెల్లింపులు చేయడాన్ని ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఇవి ఉద్యోగికి కాదు సంస్థకి కూడా వర్తిస్తాయి.

ప్రసూతి ప్రయోజన చట్టం-1961 (మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్) తప్పనిసరి. ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలకు ఇది వర్తిస్తుంది. సెక్షన్ 6 ప్రకారం మహిళలు 26 వారాల ప్రసూతి సెలవులు తీసుకోవచ్చు. డెలివరీ తేదీకి 8 వారాల ముందు నుంచి సెలవులు తీసుకోవచ్చు. గర్భస్రావం జరిగిన తర్వాత ఆరు వారాల పాటు సెలవులు తీసుకోవచ్చు. అలానే మెడికల్ బెనిఫిట్స్ కి సంబంధించి రూల్స్ కూడా వున్నాయి.

 

Read more RELATED
Recommended to you

Latest news