అందరికీ పైసలొచ్చాయా.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు..!

-

ప్రస్తుతం గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ టీఆర్ఎస్ మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం కొనసాగుతుంది అన్న విషయం తెలిసి ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించు కుంటున్నారు ఈ క్రమంలోనే ఇటీవల కేటీఆర్ మరోసారి బీజేపీ పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇటీవల పలు కుల సంఘాల నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనం లో పాల్గొన్న తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ బిజెపి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మతాన్ని అడ్డంపెట్టుకొని ఓటర్లను రెచ్చగొట్టి నాలుగు ఓట్లు సాధించేందుకు బిజెపి తప్పుడు ప్రచారం చేస్తోంది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలకు కేంద్ర ప్రభుత్వం ఏమైనా చేసిందా అంటూ ప్రశ్నించారు. గతంలో ఒకానొక సమయంలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ జన్ ధన్ ఖాతాల్లో ఏకంగా 15 లక్షల వరకు జమ చేస్తామని చెప్పారని.. ఇప్పటి వరకు ఎంత మంది ప్రధాని మోదీ చెప్పినట్లుగా జన్ధన్ ఖాతాలలో 15 లక్షల రూపాయలు పొందారు అంటూ నిలదీశారు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్. కేంద్రం తీసుకొచ్చిన 20 లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజీ తో పేద ప్రజలకు ఒక్క రూపాయి కూడా లబ్ధి చేకూరడం లేదు అంటూ వ్యాఖ్యానించారు,

Read more RELATED
Recommended to you

Latest news