ఏపీ తెలంగాణ విద్యార్థులకు భారీ షాక్..!

-

కరోనా వైరస్ ప్రభావం దృశ్య విద్యార్థులకు అడుగడుగునా తీవ్రస్థాయిలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి అనే విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో రకాల పోటీ పరీక్షలు వాయిదా పడటంతో పాటు వివిధ కోర్సులకు సంబంధించిన పరీక్షలు కూడా వాయిదా పడ్డాయి. ప్రభుత్వాలు ఎన్ని సార్లు పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించినప్పటికీ ఏదో ఒక విధంగా వాయిదా పడుతూ వస్తున్నాయి. ఇప్పుడు కరోనా వైరస్ ప్రభావం ఉన్నప్పటికీ పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వాలు నిర్ణయించినప్పటికీ ప్రకృతి కారణంగా మరోసారి పరీక్ష వాయిదా పడింది. దీంతో విద్యార్థులకు తీవ్ర నిరాశే ఎదురైంది.

రేపు తెలుగు రాష్ట్రాల్లో త్రిబుల్ ఐటీ కి సంబంధించిన ప్రవేశ పరీక్షలను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు జరిగాయి అనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే విద్యార్థులు కూడా త్రిబుల్ ఐటీ ప్రవేశ పరీక్షలు రాసేందుకు అంతా సిద్ధం అయ్యారు. కానీ ఇంతలో నివర్ తుఫాను కారణంగా పరీక్షలు కాస్త వాయిదా పడ్డాయి. రేపు జరగాల్సిన పరీక్ష కాస్త డిసెంబరు 5వ తేదీన నిర్వహించాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి. ఉదయం 11 గంటల నుంచి త్రిబుల్ ఐటీ పరీక్ష ప్రారంభం అవుతుందని.. పరీక్ష రాసే విద్యార్థులు అందరూ రెండు గంటల ముందుగానే పరీక్ష కేంద్రంలో ఉండాలని అధికారులు సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news