తెలంగాణ రాష్ట్రంలో వరి ధాన్యం విషయం పై కేంద్ర ఆహార వినియోగదారుల వ్యవహారాల మంత్రి పీయూష్ గోయల్‌తో మంత్రి కేటీఆర్ తో పాటు పలువురు భేటీ అయ్యారు. తెలంగాణ లో వరి ధాన్యం కొనుగోల్ల విషయం పై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇవ్వలని కేటీఆర్ ఆధ్వర్యం లో ని మంత్రల బృందం విజ్ఞాప్తి చేసింది. తెలంగాణ రాష్ట్రం నుంచి యాసంగి లో ఎన్ని క్వింటాల్ల వరి ధాన్యం కొనుగోలు చేస్తారో తెలపాలని అన్నారు.
అయితే ఈ సమావేశానికి తెలంగాణ ముఖ్య మంత్రి దూరంగా ఉన్నాడు. అయితే కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కోసం దాదపు మూడున్నర గంటల పాటు తెలంగాణ మంత్రులు వేచి చూసారు. కాగ కేంద్ర మంత్రి తో జరిగిన సమావేశంలో కేటీఆర్‌తోపాటు గంగుల కమలాకర్, నిరంజన్ రెడ్డి ఉన్నారు. అలాగే సీఎస్ సోమేశ్ కుమార్, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందనరావు తో పాటు పౌర సరఫరాల శాఖ కమిషనర్ అనిల్ కుమార్ పలువురు ఉన్నారు. కాగ కేంద్ర మంత్రి వరి ధాన్యం గురించి ఎలా స్పందించారో తెలియాల్సి ఉంది.