వర్మకు షాక్ ఇచ్చిన కేటిఆర్…!

-

ట్విట్టర్ లో ప్రముఖ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎప్పటికప్పుడు సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో ఉంటూ ఉంటారు. ట్విట్టర్ లో ఆయన ఎక్కువగా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం వాటిపై అందరూ విమర్శలు చేయడం మనం చూస్తూనే ఉంటాం. తాజాగా ఆయన సోషల్ మీడియాలో మరోసారి తన చేతికి పని చెప్పారు. లాక్ డౌన్ కారణంగా కొన్ని రోజులుగా మద్యం షాపులు అన్నీ మూతపడి పోవడం తో కొందరు బాగా ఇబ్బంది పడుతున్నారు.Varma congratulated ktr and kcr for their victory in telangana

కొందరికి మైండ్ పోయి ఎర్రగడ్డ ఆస్పత్రికి వెళ్ళే పరిస్థితి ఏర్పడింది. ఈ సమస్యపై రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ లో స్పందించారు. ఎవరైతే ఇవన్నీ చేస్తున్నారో.. అడీషినల్‌గా ఫ్రస్టేట్ అయ్యి పెళ్లాలని కూడా కొడుతున్నారో వాళ్లందరూ సెట్ అవ్వాలంటే.. వెస్ట్ బెంగాల్‌లో మమతా బెనర్జీ చేసినట్లు ఆ మందు ఏదో ఇంటింటికి డెలివరీ చేసే మార్గం ఏదో చూడండయ్యా బాబూ అని సిఎం లకు సలహా ఇచ్చారు.

ఈ ట్వీట్ బాగా వైరల్ అయింది. దీనిపై… మంత్రి కేటిఆర్ స్పందించారు. రాము గారు మీరు మాట్లాడేది హెయిర్ కటింగ్ గురించే కదా అంటూ కౌంటర్ ఇచ్చారు. మంత్రి ఇచ్చిన కౌంటర్ వర్మ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అయింది. కాగా తెలంగాణాలో మద్యం లేక కొంత మంది నరకం చూసే పరిస్థితి ఏర్పడింది. పిచ్చి కల్లు దొరకక కూడా అవస్థలు పడి ఏది పడితే అది తాగుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news