లైఫ్‌ సైన్సెస్‌ రంగానికి హబ్‌గా హైదరాబాద్‌ : బయో ఆసియా సదస్సులో కేటీఆర్‌

-

హైదరాబాద్‌ హెచ్‌ఐసీసీలో 20వ బయో ఆసియా సదస్సు ప్రారంభమైంది. ఈ సదస్సును రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సదస్సులో నీతిఆయోగ్‌ సభ్యులు వీకే పాల్ పాల్గొన్నారు. సదస్సుకు భాగస్వామ్య దేశంగా యూకే వ్యవహరిస్తోంది.

ప్రారంభోత్సవం అనంతరం కేటీఆర్ ప్రసంగిస్తూ.. ‘లైఫ్‌ సైన్స్‌ రంగంలో హైదరాబాద్‌ అగ్రగామిగా ఉంది. హైదరాబాద్‌లో బయో ఆసియా సదస్సు నిర్వహించడం సంతోషంగా ఉంది. హైదరాబాద్‌ ఔషధ ఉత్పత్తికి ఆసియాలోనే పెద్ద నగరం. లైఫ్‌ సైన్సెస్‌ రంగానికి హబ్‌గా హైదరాబాద్‌ అవతరించింది. లైఫ్‌ సైన్సెస్‌ రంగంలో హైదరాబాద్‌కు 7ఏళ్లలో రూ.25 వేల కోట్లు వచ్చాయి: కేటీఆర్‌. రాష్ట్రంలో 800కుపైగా ఫార్మా, బయోటెక్‌ కంపెనీలున్నాయి.’ అని అన్నారు.

మూడింట ఒకవంతు వ్యాక్సిన్ ఉత్పత్తి మన రాష్ట్రం నుంచే అవుతోందని కేటీఆర్ అన్నారు. టాప్‌-10 ఫార్మా కంపెనీల్లో నాలుగు రాష్ట్రంలో ఉన్నాయని వివరించారు. హైదరాబాద్‌లో 20కిపైగా లైఫ్‌సైన్సెస్‌, మెడ్‌టెక్‌ ఇంక్యుబేటర్లు ఉన్నాయన్న మంత్రి కేటీఆర్‌.. రాష్ట్రంలో లైఫ్‌ సైన్సెస్‌ రంగాన్ని మరింత బలోపేతం చేస్తామని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news