తెలంగాణ రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్.. అమెరికా పర్యటనలో బిజీ బిజీగా ఉన్నారు. అమెరికాలో పలు ఐటీ కంపెనీలతో వరుసగా భేటీ అవుతూ.. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పటికే పలు కంపెనీలు తెలంగాణకు రావడానికి మొగ్గుచూపుతున్నాయి. తాజా గా అమెరికాకు చెందిన ప్రముఖ ఐటీ కంపెనీ స్ప్రీంక్లర్ తెలంగాణకు రావడానికి అంగీకరించింది. తమ కార్యాలయాన్నిహైదరాబాద్ లో ఏర్పాటు చేస్తామని మంత్రి కేటీఆర్ కు హామీ ఇచ్చారు.
కాగ కేటీఆర్ బృందం న్యూయర్క్ లోని స్ప్రీంక్లర్ కంపెనీ చైర్మెన్ ర్యాగి థమస్ తో పాటు ప్రతినిధులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లో తమ కంపెనీ కార్యాలయాన్ని తీసుకువస్తామని తెలిపారు. అయితే స్ప్రీంక్లర్ కపెంనీ హైదరాబాద్ లో కార్యాలయాన్ని ఓపెన్ చేస్తే.. తెలంగాణ యువతకు దాదాపు 1000 కి పైగా ఉద్యోగాలు వచ్చే ఛాన్స్ ఉన్నాయి.
అలాగే మంత్రి కేటీఆర్.. అమెరికాలో వరుసగా పలు కంపెనీలో సమావేశం వుతున్నారు. ఇప్పటికే ప్రముఖ ఔషధ సంస్థలు అయిన ఫైజర్, జాన్సన్ అండ్ జాన్సన్, గ్లాక్సోస్మిత్ క్లైన్ ప్రతినిధులతో సమావేశంలో అయ్యారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని కోరారు.